ఆర్మూర్, జనవరి 10: ఆర్మూర్ నియోజకవర్గ పరిధిలో అభివృద్ధి పనులు చేపట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం 10కోట్ల రూపాయలను మంజూరు చేస్తూ మంగళవారం జీవో జారీ చేసింది. ఆర్మూ ర్ నియోజకవర్గాన్ని రోల్‌మోడల్‌గా నిలుపాలన్న ధ్యేయంతో అభివృద్ధిపై స్థానిక ఎమ్మెల్యే , పీయూసీ చైర్మన్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్‌రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. ఇప్పటికే నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో కుల సంఘాలకు పెద్ద ఎత్తున కమ్యూనిటీ హాళ్ల నిర్మా ణం చేపట్టారు. వాటి నిర్మాణ పనులు జోరుగా కొనసాగుతున్నాయి.
ఈ నేపథ్యంలో ఆర్మూర్ పట్టణ, రూరల్, నందిపేట్, మాక్లూర్ మండలా ల్లో మున్నూర్ కాపు, వంజర, పద్మశా లి, రజక, కమ్మవాడ, మైనార్టీ , ముదిరాజ్, గూండ్ల , గౌడ, దేవాంగ సామాజిక వర్గాల ఫంక్షన్‌హాళ్లు నిర్మా ణం కోసం ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి వినతి మేరకు ప్రభుత్వం తాజాగా రూ. పది కోట్లు మంజూరు చేసింది. తమ వినతిని మన్నిం చి అభివృద్ధి పనులకు నిధులు మంజూ రు చేయడంపై జీవన్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఆర్మూర్ నియోజకవర్గ అభివృద్ధికి అండగా నిలిచిన సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటామన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్‌కు జీవన్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.