డిచ్పల్లి, జూన్ 25: రాష్ట్ర ప్రత్యేక పోలీస్ ఏడో బెటాలియన్ డిచ్‌పల్లిలో నూతన కమాండెంట్‌గా రోహిణి ప్రియదర్శిని మంగళవారం కమాండెంట్ బి.రాంప్రకాశ్ నుంచి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కమాండెంట్ ప్రియదర్శిని మాట్లాడుతూ బెటాలియన్ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల కోసం ఎల్లప్పుడూ కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలోఅసిస్టెంట్ కమాండెంట్ కేపీ శరత్‌కుమార్, కేపీ సత్యనారాయణ, ఆర్ఐలు, ఆర్ఎస్సైలు, బెటాలియన్ సిబ్బంది పాల్గొన్నారు.