Urea App | మోర్తాడ్ : మోర్తాడ్ మండలం దోన్కల్ గ్రామ సమీపంలో జాతీయ రహదారి పై మూడు గ్రామాల రైతులు సోమవారం రాస్తారోకో నిర్వహించారు. యాప్ విధానం వల్ల ఇప్పటికీ ఒక్క యూరియా సంచి దొరక లేదని, నిమిషాల్లో యాప్ లో స్టాక్ జీరోగా మారిపోతుందని, ఇక చదువురాని వారి పరిస్థితి ఏంటని ఆందోళన వ్యక్తంచేశారు. అదేవిధంగా పెంచిన ఎరువుల ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు.
రుణమాఫీ, రైతుబందు ఇయ్యాచేత కాని సీఎం కనీసం యూరియా ఇవ్వడం చేతకాదా అని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టర్ రావాలని యాప్ విధానాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటిస్తేనే అదేవిధంగా పాస్బుక్ ఆధారంగా ఎకరానికి నాలుగు యూరియా ఇచ్చేవారని, గ్రామాల వారీగా అందుబాటులో ఉంచితేనే రాస్తారోకో విరమిస్తామని డిమాండ్ చేశారు చివరకు ఆర్మూర్ సబ్ కలెక్టర్ అభిజ్ఞాన్ మాల్వియా సంఘటన స్థలానికి చేరుకుని రైతులతో మాట్లాడి ప్రభుత్వానికి నివేదిస్తామని, రేపటి వరకు యూరియాను గ్రామాలకు తెప్పిస్తారని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు.