Nizamabad | కంఠేశ్వర్, డిసెంబర్ 8 : 28వ స్పీడో ఇన్విటేషనల్ షార్ట్ కోర్సు మీట్ స్విమ్మింగ్ పోటీలలో నిజామాబాద్ జిల్లాకు చెందిన మిట్టపల్లి రిత్విక సత్తా చాటింది. డిసెంబర్ 6,7 తేదీలలో దుబాయ్లో నిర్వహించిన పోటీలలో వివిధ దేశాల స్విమ్మింగ్ అకాడమీలు పాల్గొన్నాయి.
కాగా భారతదేశ తరపున భారత ప్రభుత్వం ఆధ్వర్యంలో కోచింగ్ నిర్వహిస్తున్న సంస్థ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియ/గ్లిన్ మార్క్ తరఫున స్విమ్మింగ్ పోటీలలో తెలంగాణ రాష్ట్రా నిజామాబాద్ కు చెందిన మిట్టపల్లి రిత్విక పాల్గొని ఉత్తమమైన ప్రతిభ కనబరిచి 50 మీటర్ల బెస్ట్ స్ట్రోక్ ను 33.26 సెకండ్లలో పూర్తిచేసి వెండి పతకం,100 మీటర్ల బెస్ట్ స్ట్రోక్ ను 1:15.69 సెకండ్లలో పూర్తిచేసి కాంస్య పథకం సాధించింది.
ఈ సందర్భంగా పథకాలు సాధించిన మిట్టపల్లి రిత్వికను స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా/గ్లెన్ మార్క్ మేనేజ్మెంట్, కోచ్ పార్థ, తెలంగాణ స్విమ్మింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి, కార్యదర్శి ఉమేష్, ఉపాధ్యక్షుడు మహిపాల్ రెడ్డి తదితరులు అభినందనలు తెలిపారు.