నవీపేట, డిసెంబర్29: కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురంలో ఈనెల 28న నిర్వహించిన 33వ జూనియర్ సౌత్‌జోన్ యాక్వటిక్ చాంపియన్‌షిప్ 2022లో జాతీయ స్థాయి స్విమ్మింగ్ పోటీల్లో తెలంగాణ నుంచి జిల్లాకు చెందిన మిట్టపల్లి రిత్విక గ్రూప్ 1 విభాగంలో 50 మీటర్ల బెస్టుస్రోక్లో బంగారు పథకాన్ని సాధించినట్లు స్విమ్మింగ్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గురువారం తెలిపారు. 2017 నుంచి కర్ణాటకకు చెందిన క్రీడాకారిని సోలోలి దలల్ పేరున ఉన్న రికార్డును బద్దలు కొట్టి రిత్విక సరికొత్త రికార్డను నెలకొల్పినట్లు ఆయన తెలిపారు.
నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం బినోలాకు చెందిన మిట్టపల్లి రుత్విక జాతీయ స్థాయి పోటీల్లో విజయం సాధించడంపై రామకృష్ణతోపాటు నిజామాబాద్ జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్‌రావు, స్విమ్మింగ్ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు గడీల రాములు, మహిపాల్‌రెడ్డి, ఆల్ ఇండియా వెల్మ సంఘం అధ్యక్షుడు పాపారావు, ఉపాధ్యక్షుడు శ్రీనివాస్‌రావు, దివాకర్‌రావు అభినందించారు.