కోటగిరి : ఏబీసీడీ వర్గీకరణలో మాదిగలకు11 శాతం రిజర్వేషన్ ( Reservation ) అమలు చేయకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం పై తిరుగుబాటు చేస్తామని ఎమ్మార్పీఎస్ ( MRPS ) జిల్లా ఇన్చార్జి వెంకటస్వామి మాదిగ హెచ్చరించారు. నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలోని ఎమ్మార్పీఎస్ పార్టీ కార్యాలయంలో నూతన మండల కమిటీని ఎన్నుకున్నారు.
ఈ సందర్భంగా వెంకటస్వామి( Venkataswamy ) మాట్లాడుతూ ఎస్సీలకు 11 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని ఇప్పటివరకు అమలు చేయలేదని, రిజర్వేషన్ చేయడంలో ప్రభుత్వం జాప్యం చేస్తుందని మండిపడ్డారు. ప్రభుత్వం వెంటనే స్పందించి 11 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం నూతన మండల కమిటీ ఎన్నుకున్నారు.
కోటగిరి ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడుగా హస్కుల శ్రీకాంత్, ఉపాధ్యక్షులుగా కన్నం శ్రీనివాస్, జలయ్య, ప్రధాన కార్యదర్శి రేణి సాయిలు, కోశాధికారి దండి సాయిబాబును ఎన్నుకున్నారు. సహాయ కార్యదర్శిగా నితిని కన్నం, ప్రచార కార్యదర్శి హస్కూల్ విజయ్, కార్యదర్శి దేగం రవీందర్, సలహాదారులు మేత్రి సాయిలు, కృష్ణ, నక్కల మారుతి, ముఖ్య సలహాదారులు గౌరవ అధ్యక్షులు కన్నం సాయిలు, కార్యవర్గ సభ్యులు వినోద్,కోటగిరి గ్రామ యూత్ అధ్యక్షులు జెండా దినేష్ను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జిల్లా సహాయ కార్యదర్శి పోచిరాం, జిల్లా మాజీ అధ్యక్షులు నాగభూషణం తదితరులు ఉన్నారు.