కంటేశ్వర్ (నిజామాబాద్) : సమస్యల వలయంలో 13వ డివిజన్, మంచినీటి ( Drinking Water) కోసం రోడ్డేక్కిన ప్రజలు నమస్తే తెలంగాణ వెబ్ వార్తకు నిజామాబాద్ ( Nizamabad ) మున్సిపల్ అధికారులు స్పందించారు. శుక్రవారం మధ్యాహ్నం మున్సిపల్ కమిషనర్ (Municipal Commissioner) దిలీప్ కుమార్ 13వ డివిజన్ను సందర్శించి అక్కడున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
డివిజన్లో చెడిపోయిన బోర్ మోటార్లను వెంటనే సరిచేసి వాటర్ ట్యాంకులను ( Water Tanks ) వెంటనే ఉపయోగంలోకి తీసుకురావాలని ఏఈ , డీఈ లను ఆదేశించారు. డ్రైనేజీలో మురికిని తొలగించాలని సూచించారు. ప్రజలకు ఇబ్బందులు కలిగితే సహించేది లేదని సిబ్బందిని హెచ్చరించారు. ప్రజలకు సమస్యలు ఏమైనా ఉంటే తనను సంప్రదించాలని, మున్సిపల్ సిబ్బంది సహకరించకపోతే ఫిర్యాదు చేయాలని ప్రజలను ఆయన కోరారు.