బిచ్కుంద, నవంబర్ 4: అధికారులు ఎలాంటి ముందస్తు హెచ్చరికలు జారీ చేయకుండా జుక్కల్ మండలంలోని కౌలాస్‌నాలా ప్రాజెక్టు గేట్లు మంగళవారం ఎత్తడంతో ప్రమాదం చోటుచేసుకున్నది. బిచ్కుంద మండలంలోని చిన్నదేవాడ వాగులో ఒక్కసారిగా వరద పెరిగింది. వాగులో నుంచి ధా న్యంతో వస్తున్న ట్రాక్టర్ వరదలో చిక్కుకోవడంతో డ్రైవర్ ప్రాణాలతో బయటపడ్డాడు. దీంతో రైతులు ప్రాజెక్టు అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ బిచ్కుందలో ఆందోళన చేపట్టారు.
టెస్టింగ్ పేరిట ఎలాంటి ప్రమాద హెచ్చరికలు లేకుండా కౌలాస్‌నాలా ప్రాజెక్టు వరద గేట్లను అధికారులు ఎత్తారు. దీంతో బిచ్కుంద మండలంలో ని చిన్న దేవాడ వాగులో వరద ఉధృతి పెరిగింది. గ్రామంలోని రైతు హజి గంగాధర్‌కు చెందిన పొలం నుంచి వడ్లను తరలిస్తున్న ట్రాక్టర్ వరదలో చిక్కుకున్నది. దీంతో అప్రమత్తమైన డ్రైవర్ కుర్మ లక్ష్మణ్ ట్రాక్టర్‌ను అక్కడే వదిలేసి ప్రాణాలతో బయట పడ్డాడు. విషయం తెలుసుకున్న చిన్న దేవాడ గ్రామ రైతులు వెంటనే బి చ్కుంద పట్టణానికి చేరుకొని గోపన్‌పల్లి చౌరస్తా వద్ద ఆందోళన చేపట్టారు.
ప్రాజెక్టు అధికారు లు వచ్చి తమకు న్యాయం చేయాలంటూ బాన్సువాడ- బి చ్కుంద ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. విషయం తెలుసుకున్న తహసీల్దార్ వేణుగోపాల్, మద్నూర్ ఎస్సై విజయ్ కొండ అక్కడికి చేరుకొని రైతులను సముదాయించారు. తమకు న్యాయం జరిగే వరకూ ఇక్కడి నుం చి కదిలేది లేదంటూ భీష్మించుకు కూర్చున్నా రు. జరిగిన నష్టంపై ఉన్నతాధికారులకు నివేదిక పంపించి, న్యాయం జరిగేలా చూస్తానని తహసీల్దార్ భరోసా ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు.