ఖలీల్వాడి, మార్చి 9: నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని వేణుమాల్లో నమ స్తే తెలంగాణ, తెలంగాణ టుడే ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రాపర్టీ షోకు అనూహ్య సందన వచ్చింది. రెండురోజులపాటు నిర్వహించిన ప్రాపర్టీషో ఆదివారం ముగిసింది. నిజామాబాద్, హైదరాబాద్కు చెందిన ప్రముఖ డెవలపర్స్, రియల్ఎస్టేట్ సంస్థలు తరలివచ్చాయి.
ప్రదర్శనలో 22 సంస్థలు కొలువుదీరాయి. పెద్ద సంఖ్యలో సందర్శకులు తరలిరావడంతో ప్రాపర్టీ షో సందడిగా మారింది. వివరాలు తెలుసుకునేందుకు స్టాళ్ల వద్ద బారులు తీరారు. తమ అభిరుచులకు అనుగుణంగా ఉన్న నిర్మాణాలను ఎంచుకున్నారు. ప్లాట్లు, ఫ్లాట్లు, విల్లాలు అందుబాటు ధరలో ఉండడంతో కొనుగోలుకు ఆసక్తి చూపారు. ప్రాపర్టీస్ కొనుగోలు చేసేవారి కోసం రుణ సదుపాయం కల్పించడానికి ఎస్బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా ప్రత్యేక స్టాళ్లు ఏర్పాటు చేశాయి.
నిజామాబాద్, హైదరాబాద్ మార్గంలో చేపడుతున్న పలు నిర్మాణ రంగాల ప్రాజెక్టుల్లో మధ్య తరగతి వర్గాలకు అందుబాటులో ధరలు ఉన్నాయని అభిప్రాయపడ్డారు. నూతన ఇండ్ల నిర్మాణం, అపార్ట్మెంట్లలో ఫ్లాట్లకు సంబంధించి ఆయా సంస్థ ప్రతినిధులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రముఖ రియల్ ఎస్టేట్, గృహ నిర్మాణ సంస్థలను ఒకే గొడుగు కిందకి తీసుకువచ్చి, ఇంతటి అద్భుతమైన కార్యక్రమాన్ని చేపట్టిన నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడేను సందర్శకులు అభినందించారు.
నగరవాసులకు అందుబాటులో..
నిజామాబాద్ నగరవాసులకు వ్యయభారం కాకుండా వినూత్న ఆలోచనలతో నమస్తే తెలంగాణ , తెలంగాణ టుడే ప్రాపర్టీ షో నిర్వహిస్తున్నది. ప్రతి సంవత్సరం ఏదో ఒక కార్యక్రమంతో ప్రజల ముందుకు ఆటోషో తీసుకువస్తున్నది. ఆటోషోలో కొనుగోలు దారుల అభిరుచులకనుగుణంగా వివిధ కంపెనీల వాహనాలను అందుబాటులోకి తెచ్చింది. అన్ని పర్మిషన్లు ఉన్న సంస్థలకే ప్రాపర్టీ, ఆటోషోల్లో అనుమతిస్తున్నది. ప్రజలు మోసపోకుండా ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఉండేందుకు ముచ్చటగా మూడో సారి ప్రాపర్టీ షో నిర్వహించినట్లు నిజామాబాద్ నమస్తే తెలంగాణ బ్రాంచ్ మేనేజర్ ధర్మరాజు తెలిపారు. కార్యక్రమంలో నమ స్తే తెలంగాణ బ్యూరో చీఫ్ జూపల్లి రమేశ్, ఏడీవీటీ సిబ్బంది పాల్గొన్నారు.
ఒకే వేదికపై కొలువుదీరిన ప్రముఖ కంపెనీలు
మెయిన్ స్పాన్సర్ వాసవి గ్రూప్స్, కో -స్పాన్సర్ శ్రీ వేంకటేశ్వర కన్స్ట్రక్షన్స్(ఎస్వీసీ), మకుట బిల్డర్స్ (క్రౌన్ ఆఫ్ ఎక్స్లెన్స్), అసోసియేషన్ విత్ : శ్రీ అశోకా బిల్డర్స్ అండ్ డెవలపర్స్, ఐశ్వర్యం హోమ్స్, రాయల్ ఓక్ నిజామాబాద్, బాలాజీ డివైన్, ఏపీడీ డెవలపర్స్, శ్రీ గోవిందసాయి బిల్డర్స్ అండ్ డెవలపర్స్, శ్రీ ఎస్ఎల్ ఎన్ ప్రాపర్ట్సీ ప్రైవేట్ లిమిటెడ్, అంకురమ్, భూమి స్పేస్, సన్యుగ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్, శ్రీ నార్త్ క్రెస్ట్, మయూర సూపర్ లివింగ్, ఆదూరి ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ పాటు స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, టాటాపవర్ సొలారూఫ్, కపిల్ ప్రాపర్టీస్, టీఎంఆర్ గ్రూప్, అక్షయ ఎంటర్ ప్రైజెస్ స్టాళ్లు ఏర్పాటు చేశారు.