మాచారెడ్డి, జూన్ 24 : మండలంలోని లచ్చాపేట గ్రామంలో ప్రైవేట్ పాఠశాలల బస్సులను గ్రామ సర్పంచ్ శ్రీనివాస్‌రెడ్డి, పాలకవర్గం ఆధ్వర్యంలో గ్రామ అభివృద్ధి కమిటీ చైర్మన్, మాజీ ఎంపీటీసీ బుస శ్రీను, గ్రామస్తులు బుధవారం అడ్డుకున్నారు.
ప్రైవేట్ పాఠశాలల బస్సులు తమ గ్రామంలోకి రావొద్దని సూచించారు. ప్రాథమిక, జడ్పీహెచ్ఎస్లో గతంలో కన్నా ఇప్పుడు సౌకర్యాలు ఎంతో మెరుగయ్యాయని అన్నారు. ప్రైవేట్ పాఠశాలల బస్సులను ప్రతిరోజూ అడ్డుకుంటామని, గ్రామస్తులు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు, గ్రామస్తులు పాల్గొన్నారు.