Bodhan ACP Srinivas | శక్కర్ నగర్: ప్రతీ వ్యక్తి తాము చేసే సేవా కార్యక్రమాలతోనే గుర్తింపు వస్తుందని, ఇందులో భాగంగానే బోధన్ పట్టణానికి చెందిన మారుతి మందిర్ అర్చకుడు ప్రవీణ్ మహారాజుకు బ్రాహ్మణ సేవా సంఘం సమాఖ్య రాష్ట్ర కార్యవర్గంలో ఆర్గనైజింగ్ సెక్రటరీగా నియామకం కావడం అభినందనీయమని బోధన్ ఏసీపీ శ్రీనివాస్ అన్నారు. బోధన్ పట్టణంలోని శ్రీ చక్రేశ్వర శివ మందిరంలో పలువురు ప్రముఖుల చేతుల మీదుగా సోమవారం నిర్వహించిన సన్మాన ఉత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.
ఆలయ అర్చకుడిగా విధులు నిర్వహించడంతోపాటు పలు సామాజిక కార్యక్రమాల్లో చొరవ చూపుతూ ముందుండి ప్రవీణ్ మహారాజ్ అందిస్తున్న సేవలు అభినందనీయమని ఏసీపీ అన్నారు. జిల్లా కార్యవర్గంతో పాటు రాష్ట్రస్థాయి కార్యవర్గంలో ప్రవీణ్ మహారాజ్ కు చోటు లభించడం బోధన్ కు గర్వకారణమన్నారు. ఈ సందర్భంగా ప్రవీణ్ మహారాజుకు పలువురు శాలువాలు కప్పి పూలమాలలు వేసి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ప్రవీణ్ మహారాజ్ మాట్లాడుతూ తనపై అభిమానంతో సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించిన ప్రతీ ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు.
అదేవిధంగా తనకు లభించిన పదవితో బ్రాహ్మణ సమాజంతో పాటు పలువురికి తాను సేవలందించేందుకు సిద్ధంగా ఉన్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో బోధన్ పట్టణ వీడీసీ చైర్మన్ గంగాధర్ పట్వారి, బోధన్ ఎస్హెచ్వో వెంకట నారాయణ, శివాలయం చైర్మన్ హరికాంత్ చారి, మారుతి మందిర్ చైర్మన్ గుండేటి శంకర్, ప్రదీప్ గుప్తా, తంబు సెట్, బోధన్ బ్రాహ్మణ సేవా సమాజ్ గౌరవ అధ్యక్షుడు వినోద్ పట్వారి, జనరల్ సెక్రెటరీ ఉమానంద్ వైద్య, మహిళా అధ్యక్షురాలు మనోజ్ మనిషా వైద్య, ఏక చక్ర తిరంగా సమితి అధ్యక్షుడు అంకు మహేష్, మాజీ కౌన్సిలర్ దామోదర్, అంకు సంతోష్ రెడ్డి, వీడీసీ జనరల్ సెక్రెటరీ బీర్కూర్ శంకర్, వీడీసీ క్యాషియర్ శ్రీనివాస్, సంగ్రామ్, బోదుశేఖర్, శంకర్, కిరణ్, లక్ష్మణరావు పాటిల్, సేవా సంస్థాన్ అధినేత పద్మా సింగ్, బోధన్ పట్టణ ప్రజలు పాల్గొన్నారు.