రుద్రూర్, ఏప్రిల్ 21: ముస్లింలు రంజాన్ పండుగను సంతోషంగా జరుపుకోవాలని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి ఆకాంక్షించారు. మైనార్టీల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని తెలిపారు. శుక్రవారం రుద్రూర్ మండల కేంద్రంలోని మైనారిటీ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ఆయన పాల్గొన్నారు. ముస్లింలతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ముస్లింల కోసం దర్గాల వద్ద అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు.
కార్యక్రమంలో ఆర్డీవో రాజేశ్వర్, ఏసీపీ కిరణ్‌కుమార్, జడ్పీటీసీ నారోజి గంగారాం, వైస్ ఎంపీపీ సాయిలు, సర్పంచ్ శేఖర్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పత్తి లక్ష్మణ్, కో-ఆప్షన్ మెంబర్ మస్తాన్, విండో చైర్మన్ సంజీవ్‌రెడ్డి, విండో మాజీ చైర్మన్ పత్తి రాము, కలీం, జమీల్, ఖాదర్, అహ్మద్ హుస్సేన్, యువజన విభాగం అధ్యక్షుడు రవి, సోషల్‌మీడియా మండల కన్వీనర్ లాల్‌మహ్మద్, జలీల్ తదితరులు పాల్గొన్నారు.