ఆశీర్వాద సభకు పోటెత్తిన జనం
పట్టణంలో శుక్రవారం నిర్వహించిన సీఎం కేసీఆర్ ఎన్నిక ప్రచార ప్రజా ఆశీర్వాద సభకు ఆర్మూర్ నియోజకవర్గంలోని ప్రజలు హోరెత్తారు. నియోజకవర్గంలోని నందిపేట్, మాక్లూర్, డొంకేశ్వర్, ఆలూర్, ఆర్మూర్ మండలాలతోపాటు ఆర్మూర్ పట్టణం నుంచి ప్రజలు తరలివచ్చారు.
- స్వచ్ఛందంగా తరలివచ్చిన ప్రజలు
ఆర్మూర్, నవంబర్3: పట్టణంలో శుక్రవారం నిర్వహించిన సీఎం కేసీఆర్ ఎన్నిక ప్రచార ప్రజా ఆశీర్వాద సభకు ఆర్మూర్ నియోజకవర్గంలోని ప్రజలు హోరెత్తారు. నియోజకవర్గంలోని నందిపేట్, మాక్లూర్, డొంకేశ్వర్, ఆలూర్, ఆర్మూర్ మండలాలతోపాటు ఆర్మూర్ పట్టణం నుంచి ప్రజలు తరలివచ్చారు. మధ్యాహ్నం 12 గంటలకు 63వ జాతీయ రహదారి పక్కన ఉన్న సభా స్థలానికి స్వచ్ఛందంగా చేరుకున్నారు. నాలుగు దిక్కుల నుంచి ఒక్కసారిగా ప్రజలు బస్సులు, వ్యాన్లు, ద్విచక్ర వాహనాలపై వచ్చి వారి వారికి కేటాయించిన పార్కింగ్ స్థలాల్లో వాహనాలను నిలిపి సభకు చేరుకున్నారు. దీంతో ఎటుచూసినా దారులన్నీ కేసీఆర్ సభకు వచ్చే జపంతో కిటకిట లాడాయి. రెండు గంటల ముందే సభా ప్రాంగణం జనంతో నిండిపోయింది. రెండు గంటలపాటు దూం దాం కళాకారుల సంస్కృతికి ప్రదర్శనలు చూస్తూ సభలో లీనమైపోయారు. ముఖ్యంగా సభకు మహిళలు, యువకులు, వృద్ధులు ఉత్సాహంగా తరలివచ్చారు. సిద్దులగుట్ట వెనుక భాగంలోని సభా స్థలానికి వచ్చిన జనాలతో సిద్దులగుట్ట ప్రాంతం జనసంద్రమైంది. ప్రజల కేరింతలు, జై తెలంగాణ నినాదాలతో సభా ప్రాంగణం మరుమోగింది.
సీఎం నోట జీవన్‌రెడ్డి మాట
ఆర్మూర్‌టౌన్, నవంబర్3: ఆర్మూర్ పట్టణంలోని ఆలూర్ బైపాస్ రోడ్డు వద్ద నిర్వహించిన సీఎం కేసీఆర్ భారీ బహిరంగ సభలో సీఎం కేసీఆర్ నోట ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి పేరుతో సభ ప్రారంభించడంతో అభిమానుల్లో మరింత జోష్ పెరిగింది. దీంతో అభిమానులు ఎమ్మెల్యే ప్లకార్డులు ప్రదర్శిస్తూ కేరింతలు కొట్టారు.

కేసీఆర్ పాలన బాగుంది..
కేసీఆర్ తొమ్మిదేండ్ల్ల పాలన చాలా బాగుంది. ప్రజలంతా మళ్లీ కేసీఆరే రావాలని కోరుకుంటున్నారు. 2016 రూపాయాల పింఛన్ ఇవ్వడం ఎంతో గొప్ప విషయం. మళ్ల గెలిస్తే దానిని రూ.5వేలకు పెంచుతామని తెలుపడం సంతోషంగా ఉంది. గతంలో రూ.200 పింఛన్ ఎటూ సరిపోయేది కాదు. బీఆర్ఎస్ పాలనలో పేదలకు ఎంతో న్యాయం జరుగుతోంది.
-పోహర్ గంగామణి, ఆర్మూర్
కేసీఆర్ వెంటే ఉంటాం…
సమైక్య పాలనలో లేని సంతోషం ప్రస్తుతం కేసీఆర్ పాలనలో నెలకొంది. ప్రతి నెలా క్రమం తప్పకుండా పింఛన్లు ఇవ్వడంతో ప్రజలంతా సంతోషంగా ఉన్నారు., నాకు ప్రతి నెలా రూ.2016 బీడీ పింఛన్ వస్తుంది. దీంతో కుటుంబ గడుస్తోంది. కేసీఆర్‌కు రుణపడి ఉంటాం.
– శాంతాబాయి, ఆర్మూర్
కేసీఆర్‌కే నా మద్దతు..
కేసీఆర్ పాలనలో రాష్ట్రంలోని ప్రజలంతా ఎంతో సంతోషంగా ఉన్నారు. పేదలు రోజుకు రెండు మెతుకులు తింటున్నారంటే ఆది కేసీఆర్ పుణ్యమే. తెలంగాణ వచ్చాక కేసీఆర్ అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేశారు. గ్రామాల్లో ప్రజలంతా ఎంతో ఆనందంగా జీవిస్తున్నారు. కేసీఆర్‌కే నా పూర్తి మద్దతు.
– చాకలి గంగు, గోవింద్‌పేట్
నీటి కష్టాలు తీరాయి..
కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల జీవితాలు మారినవి. ముఖ్యంగా ప్రజలు గతంలో నీటి కోసం ఎంతో ఇబ్బందులు పడేవారు. కానీ ప్రస్తుతం మిషన్ భగీరథతో మా కష్టాలు తీరాయి.
– కొత్తూర్ లలిత, ఆర్మూర్
సార్‌ను వదులకోం..
కేసీఆర్ అందరికీ మంచి పనులు చేస్తున్నాడు. సార్‌ను ఎవరూ వదులుకోరు. ఎటు చూసినా బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినా అభివృద్ధి మనకు కనిపిస్తోంది. ఇంకా అభివృద్ధి జరగాలంటే కేసీఆర్ సార్ మళ్లీ రావాలి.
– సనుగుల సుమని, సుర్బిర్యాల్
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pramila Jayapal | అది ప్రజాస్వామ్యానికే ప్రమాదకరం..ఇండియాలో ‘సర్’ పై యూఎస్ కాంగ్రెస్ మెంబర్ ప్రమిలా జయ్‌పాల్ తీవ్ర ఆందోళన
Cyber Crime | వీడియోకాల్ చేసి రూ. 2.20 కోట్లు కొట్టేసిన సైబర్ కేటుగాళ్లు
Ramayana | ‘రామాయణ’ విజువల్స్‌పై మళ్లీ విమర్శలు.. హాలీవుడ్ స్థాయి గ్రాఫిక్స్ ఎక్కడంటూ నెటిజన్ల ప్రశ్నలు!
Jailer 2 | ‘జైలర్ 2’ ట్విట్టర్ రివ్యూ.. రజనీకాంత్ వింటేజ్ మాస్ స్వాగ్, అనిరుధ్ బీజీఎంతో థియేటర్లలో రచ్చ!
Plane crash | అమెరికాలో ఘోర విమాన ప్రమాదం.. ఆరుగురు మృతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

