ఇందూరులో సినీ తారలు శుక్రవారం సందడి చేశారు. నగరంలో కొలువుదీరిన సీఎంఆర్ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవ వేడుకలో హీరో రామ్, హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ అభిమానులను అలరించారు. హైదరాబాద్‌లోని పూలాంగ్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన షాపింగ్ మాల్‌ను ఎంపీ అర్వింద్ ప్రారంభించారు.
అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, మేయర్ నీతూకిరణ్, సీఎంఆర్ షాపింగ్ మాల్ చైర్మన్ మాపూరి వెంకటరమణ, మేనేజింగ్ డైరెక్టర్ మాపూరి మోహన్ బాలాజీ తదితరులు పాల్గొన్నారు.
– ఖలీల్‌వాడి, సెప్టెంబర్ 27