Pathological lab | పోతంగల్ అక్టోబర్ 8: పొతంగల్ మండల కేంద్రంలో పాథోలాజికల్ ల్యాబ్ ను బీఆర్ఎస్ నాయకుడు ఎంపీటీసీల ప్లోరం మాజీ అధ్యక్షుడు ఎలమంచిలి శ్రీనివాస్ రావు స్థానిక నాయకులతో కలిసి బుధవారం ప్రారంభించారు. రుద్రూర్ మండలానికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్త శేఖర్ పోతంగల్ మండల కేంద్రంలో ల్యాబ్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎలమంచిలి శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరై స్థానిక నాయకులతో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ కార్యకర్తలు పార్టీ ప్రతిష్టతకు పనిచేస్తూనే సొంతగా వ్యాపారాలు చేసుకుంటూ ఆర్థికంగా బలోపేతం కావాలని అన్నారు. వచ్చే స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పార్టీ కార్యకర్తలు,నాయకులు కృషి చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు నవీన్, నాయకులు తేల రవికుమార్, రుద్రూర్ మండల పార్టీ అధ్యక్షుడు మధు, సుధాం సాయిలు, గజేందర్, కోటగిరి హనుమంతు, బీజేపీ నాయకుడు పబ్బ శేఖర్, స్టార్ హాస్పటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.