భిక్కనూరు, ఏప్రిల్ 29: తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సౌత్ క్యాంపస్‌లో పార్ట్‌టైం లెక్చరర్లు చేపట్టిన సమ్మె తొమ్మిదో రోజుకు చేరుకున్నది. ఇందులో భాగంగా మంగళవారం వంటా-వార్పు కార్యక్రమం చేపట్టి నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఉద్యోగ భద్రత కల్పించాలని, మినిమం టైం స్కేల్ ఇవ్వాలని కోరారు. ఎన్నికల వేళ తమకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. సమ్మె చేస్తున్న పార్ట్‌టైం లెక్చరర్లకు క్యాంపస్‌లోని టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది సంఘీభావం ప్రకటించారు.