ఎన్నికల కమిషన్ పార్లమెంటు ఎన్నికలకు షెడ్యూల్ను ప్రకటించడంతో అధికారులు కోడ్ అమలుకు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కూడళ్ల వద్ద ఉన్న ఎన్టీఆర్, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ విగ్రహాలకు ముసుగులు వేశారు. పలుచోట్ల పార్టీలకు చెందిన ఫ్లెక్సీలను తొలగించారు.
– స్టాఫ్ ఫొటోగ్రాఫర్, నిజామాబాద్