ఆర్మూర్ : ఆర్మూర్ పట్టణంలో (Armoor town) ట్రాఫిక్ సమస్య రోజురోజుకూ తీవ్రమవుతుంది. పెరుగుతున్న జనాభా, వాహనాల సంఖ్యకు అనుగుణంగా రోడ్ల విస్తరణ చేపట్టకపోవడంతో ప్రధాన రహదారులు ఇరుకుగా మారుతున్నాయి. దీంతో రోడ్లకు ఇరువైపులా పార్కింగ్ సమస్య ( Parking Problem ) ఉత్పన్నమవుతుంది.
ముఖ్యంగా పట్టణంలోని బస్టాండ్ ( Bus Stand) ఎదుట, మామిడిపల్లి చౌరస్తా ( Mamidipalli Chowrasta), అంబేద్కర్ చౌరస్తా, పాత బస్టాండ్ తదితర ప్రాంతాల్లో హోటళ్లు, వ్యాపార, వాణిజ్య దుకాణాలు అధికంగా ఉన్నాయి. వీటికి సెల్లార్ సౌకర్యం లేకపోవడంతో వాహనదారులు రోడ్లపైనే వాహనాలు నిలిపివేస్తున్నారు. దీంతో అక్కడ ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉంటుంది.
సమస్యను అటు మున్సిపల్ అధికారులుగాని, పోలీసులు గాని పట్టించుకోకపోవడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ట్రాపిఖ సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.