మద్నూర్ : కామారెడ్డి జిల్లా మద్నూర్(Madnoor) మండల కేంద్రంలో సోయా కొనుగోలు కేంద్రం (Soya buying center) ఏర్పాటు పట్ల కాంగ్రెస్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మార్కెట్ యార్డులో ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు (MlA Laxmikanta Rao) చిత్రపటానికి నాయకులు, రైతులు గురువారంపాలాభిషేకం చేశారు. కొనుగోలు కేంద్రం ఏర్పాటుకు ప్రత్యేక చొరవ చూపిన ఎమ్మెల్యేకు వారు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు హన్మండ్లు స్వామి, రాంపటేల్, ప్రజ్ఞకుమార్, సంతోష్, బాలు తదితరులు పాల్గొన్నారు.