Kamareddy | కామారెడ్డి : కామారెడ్డి జిల్లా ప్రధాన న్యాయ మూర్తిగా ముక్తిద గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఆమెకు న్యాయశాఖ ఉద్యోగులు మొక్కలను అందజేసి ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో న్యాయశాఖ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు జే భుజంగరావు, ప్రధాన పరిపాలనా అధికారి పీ రాంచందర్ రావు, వెంకట్ రెడ్డి, చంద్రసేన్ రెడ్డి, కరుణ, మమత, శ్రీలత, నిఖిల్ రెడ్డి, సయ్యద్ రషీద్ అలీ తదితర న్యాయశాఖ ఉద్యోగులు పాల్గొన్నారు.