ఆర్మూర్ : నిజామాబాద్ జిల్లా ఆర్మూర్(Armor) పట్టణం ధోబిఘాట్లో వృద్ధుడు సజీవ దహనమయ్యాడు. ఎస్హెచ్వో సత్యనారాయణ (SHO Satyanarayana) కథనం ప్రకారం ధోబిఘాట్లో నివాసముంటున్న సీతారామారావు(75) అనే వృద్ధుడు కొంతకాలంగా పక్షవాతంతో బాధ పడుతున్నాడు.
రాత్రి ఆరుబయట డేరాలో నిద్రపోగా ప్రమాదవశాత్తు డేరాకు నిప్పంటుకుని సజీవదహనమయ్యాడని ఎస్హెచ్వో తెలిపారు. మృతుడి కుమారుడు రామేశ్వరరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు ఆయన వివరించారు.