Anganwadi building | పోతంగల్, జులై 16: మండల కేంద్రంలోని ఒడ్డేర కాలనీ వద్ద ఉన్న అంగన్వాడీ కేంద్రం అద్దె భవనంలో అరకొరక వసతుల మద్య కొనసాగుతుంది. కాగా ‘అద్దె భవనాల్లో అంగన్వాడీ కేంద్రాలు..’ ‘సరైన సదుపాయాలు లేక ఇబ్బందులు, ఏడాదిలో రెండు సార్లు పాము కలకలం’ అనే శీర్షికన మార్చి 16 న ‘నమస్తే తెలంగాణ’ లో కథనం ప్రచురితమైంది.
ఈ భవనం మండల కేంద్రంలోని బీసీ కాలనీలో నూతన భవన నిర్మాణ పనులు చేపట్టగా ఆ పనులు మూడు సంవత్సరాలైనా పూర్తి కాలేదు. భవన నిర్మాణం పూర్తి పూర్తి చేసి అందించాలని కథనం ప్రచురించగా దీంతో స్పందించిన అధికారులు భవన నిర్మాణ పనులు పూర్తి చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సీడీపీవో పద్మ, అంగన్వాడీ సూపర్వైజర్ గోపిలక్ష్మీ , ఎంపీడీవో చందర్, యూనియన్ లీడర్ బాల లక్ష్మి, టీచర్ జ్యోతి, స్థానిక నాయకులు పుప్పాల శంకర్, గంధపు పవన్, కేశ వీరేశం, అంగన్వాడీ టీచర్లు తదితరులు పాల్గొన్నారు.