రుద్రూర్ : మండలంలో జరిగిన రోడ్డు ప్రమాద బాధిత కుటుంబాలకు, అగ్ని ప్రమాదంలో సర్వస్వం కోల్పోయిన బాధితులకు ఎన్ఆర్ఐ( NRI ) ఆర్థిక సహాయం (Financial assistance) అందజేశారు. బీజేపీ మండల కమిటీ పిలుపు మేరకు బాన్సువాడ నియోజకవర్గం నాయకులు, ఎన్ఆర్ఐ కోనేరు శశాంక్ ( Noneru Shashank) చీకడపల్లి గ్రామంలో రోడ్డు ప్రమాదంలో గాయపడిన బీజేపీ గ్రామ బూత్ అధ్యక్షుడి భార్య , కుమారుడిని పరామర్శించారు. బీజేపీ ఉపాధ్యక్షులు గుడిసె ప్రభాకర్‌కు సైతం గాయాలు అయ్యాయి .
ఈ సందర్భంగా బాధితులకు 25 కిలో బియ్యం, ఒక్కొక్కరికి రూ. 5వేలు, ఆర్థిక సహాయం అందజేశారు. అంబం గ్రామంలో జరిగిన అగ్ని ప్రమాదంలో రెండు ఇండ్లు దగ్ధమయ్యాయి. కోనేరు శశాంక్ వారిని కలిసి పరామర్శించి వారికి కూడా 25 కిలో బియ్యం, రూ. 5వేలు సహాయం అందజేశారు.
ఈ కార్యక్రమం లో బాన్సువాడ నియోజకవర్గం కన్వీనర్ గుడుగుట్ల శ్రీనివాస్, జిల్లా కౌన్సిల్ మెంబర్ ప్రశాంత్ గౌడ్, రుద్రూర్ మండల అధ్యక్షులు ఆలపాటి హరికృష్ణ, ఏముల గజేందర్, సాయినాథ్, సున్నం సాయిలు, గంగాధర్, రేపల్లి సాయిప్రసాద్,శానం బాలాజీ , తదితరులు పాల్గొన్నారు.