నిజాంసాగర్ నీటి విడుదల
నిజాంసాగర్ ప్రాజెక్టు నుంచి ప్రధాన కాలువ ద్వారా ఆదివారం నీటిని విడుదల చేశారు. ఆయకట్టు రైతులు నాట్లు వేయనున్న దృష్ట్యా మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు, జడ్పీ చైర్పర్సన్ దఫేదార్ శోభారాజు, ఇరిగేషన్ అధికారులతో కలిసి నీటి విడుదలను ప్రారంభించారు.
- నిజాంసాగర్, జూన్ 23: వానాకాలం పంటల సాగుకు
నిజాంసాగర్ ప్రాజెక్టు నుంచి ప్రధాన కాలువ ద్వారా ఆదివారం నీటిని విడుదల చేశారు. ఆయకట్టు రైతులు నాట్లు వేయనున్న దృష్ట్యా మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు, జడ్పీ చైర్పర్సన్ దఫేదార్ శోభారాజు, ఇరిగేషన్ అధికారులతో కలిసి నీటి విడుదలను ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే పోచారం మాట్లాడుతూ రాష్ట్రంలో మొదటగా ఈ ప్రాంతంలోని రైతులు రోహిణి కార్తెలోనే నార్లు పోసి త్వరగా నాట్లు వేస్తారని అన్నారు. గత ఏడాది మాదిరి ఈ సంవత్సరం కూడా జూన్ నెలలోనే నీటిని విడుదల చేయాలని రైతులు కోరారని, రైతుల కోరికను సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. రైతుల కోరిక మేరకు వానాకాలం పంటల సాగుకు నీటిని విడుదల చేశామన్నారు. నిజాంసాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి సామర్థ్యం 17.6 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 4.3 టీఎంసీల నీరు ఉన్నదని, ఇందులో డెడ్ స్టోరేజ్ పోను 3.6 టీఎంసీల నీటిని కాలువలకు విడుదల చేయవచ్చని తెలిపారు. మొదటి విడుతలో భాగంగా 15రోజులపాటు 1400 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తామని, తర్వాత ఒక్కో విడుతలో పది రోజులు నీటి విడుదల జరుగుతుందని చెప్పారు. ఇరిగేషన్, రెవెన్యూ, పోలీసు శాఖలు సమన్వయంతో పనిచేసి అన్ని డిస్ట్రిబ్యూటరీలకు నీళ్లు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్రంలోని ప్రాజెక్టుల్లో నీళ్లు లేకపోవడంతో ఈ ఏడాది వానాకాలం పంటల సాగుకు నీరు విడుదల చేయలేదని, కేవలం నిజాంసాగర్ నుంచి మాత్రమే నీటి విడుదల జరిగిందన్నారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘వినియోగదారుల హక్కులపై చైతన్యం కల్పించాలి’
WPL 2027 | ముంబై ఇండియన్స్ ట్రేడింగ్ డీల్.. మహిళా పేసర్‌కు రూ.10 లక్షలు..!
Pawan Kalyan | పవన్ కళ్యాణ్ సినీ ప్రయాణానికి 30 ఏళ్లు.. ఎమోషనల్ పోస్ట్‌తో శుభాకాంక్షలు తెలిపిన అల్లు అరవింద్!
Binod Chaudhary: నేపాలీ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన ఆ దేశ ఏకైక బిలియనీర్
వరల్డ్ బ్యాంక్ బృందం నల్లగొండ క్లాక్ టవర్ జంక్షన్ అభివృద్ధి పనుల పరిశీలన
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

