భయపెట్టే ‘స్కేరీ పిక్చర్’
బాలీవుడ్ ఫైర్‌బ్రాండ్ కంగనా రనౌత్ హారర్ చిత్రంలో నటిస్తున్నది. తెలుగు దర్శకుడు రవిబాబు రూపొందిస్తున్న ఈ చిత్రానికి రానా దగ్గుబాటి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు ‘స్కేరీ పిక్చర్' అనే టైటిల్‌ను ఖరారు చేశారు.
బాలీవుడ్ ఫైర్‌బ్రాండ్ కంగనా రనౌత్ హారర్ చిత్రంలో నటిస్తున్నది. తెలుగు దర్శకుడు రవిబాబు రూపొందిస్తున్న ఈ చిత్రానికి రానా దగ్గుబాటి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు ‘స్కేరీ పిక్చర్’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. టాలీవుడ్లో విభిన్న కథలు, ప్రయోగాత్మక చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు రవిబాబు..ఈ ప్రాజెక్ట్‌తో బాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్నారు.
శనివారం ఢిల్లీలో నిర్వహించిన ‘హారర్కాన్ ఇండియా 2026’ కార్యక్రమంలో రానా దగ్గుబాటి ఈ చిత్రాన్ని ప్రకటించారు. కంగనారనౌత్ గతంలో ‘రాజ్: ది మిస్టరీ కంటిన్యూస్’ ‘చంద్రముఖి-2’ వంటి హారర్ చిత్రాల్లో నటించారు. సుదీర్ఘ విరామం తర్వాత ఆమె హారర్ సినిమాలో భాగం కావడం విశేషం. ప్రయోగాత్మక కథలతో సినిమాలు తీసే రవిబాబు..కంగనారనౌత్ వంటి అగ్ర కథానాయికతో ఎలాంటి హారర్ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారన్నది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం ‘క్వీన్-2’ ‘సర్కిల్’ వంటి చిత్రాలతో బిజీగా ఉంది కంగనారనౌత్. మరోవైపు రాజకీయాల్లో కూడా క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

