నిజామాబాద్ లీగల్, డిసెంబర్ 9 : కక్షిదారుల ప్ర యోజనాలను చట్టపరిధిలో పరిష్కరించుకోవడం, అప్పీలుకు వీలుకాని పద్ధతిలో అవార్డులు జారీ చే యడమే జాతీయ లోక్‌అదాలత్ ప్రధాన ధ్యేయమ ని ప్రిన్సిపల్ డిస్ట్రిక్ అండ్ సెషన్స్ జడ్జి, జిల్లా న్యా య సేవాధికార సంస్థ చైర్పర్సన్ సునీత కుంచాల తెలిపారు. న్యాయార్థులకు, వారి అభీష్టం మేరకు కేసులను రాజీ కుదిర్చి పరిష్కరించడంలో న్యాయ సేవా సంస్థకు కక్షిదారులు, న్యాయవాదులు, ఫిర్యాదుదారులు, బాధితులు సహకరించాలని ఆమె కో రారు. డిసెంబర్ 11న శనివారం ఉమ్మడి జిల్లాలో నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్‌పై విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. దీర్ఘకాలం వివాదాలు కొనసాగడం వ్యక్తులకు, వ్యవస్థకు నష్టదాయకమని, ఇరుపక్షాలు రాజీపడి న్యా య వివాదాలను త్వరితగతిన లోక్ అదాలత్‌లో పరిష్కరించుకోవడంతో ఇరువురికి అన్ని విధాలా లాభకరమేనని ఆమె తెలిపారు. ఆర్మూర్, బోధన్, బిచ్కుంద, బాన్సువాడ, ఎల్లారెడ్డి, కామారెడ్డి కోర్టులతో పాటు నిజామాబాద్ జిల్లా కోర్టు ప్రాంగణంలోని న్యాయస్థానాల్లో మొత్తం 22 లోక్ అదాలత్ బెంచ్‌లు ఏర్పాటు చేసినట్లు వివరించారు. ప్రభు త్వ బీమారంగ అధికారులు, బ్యాంకు అధికారులతో సన్నాహాక సమావేశాలు నిర్వహించి బ్యాంకు బీమా కేసులను గుర్తించి ఆ మేరకు అవార్డుల జారీ చేయడానికి అవకాశాలు ఉన్నాయన్నారు. లోక్ అదాలత్‌తో న్యాయార్థులకు ఆర్థిక ప్రయోజనమే కాకుండా సమయం కూడా కలిసి వస్తుందన్నారు. సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి జగన్నాథం విక్రమ్ మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాలో జాతీయ లోక్‌అదాలత్ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామని సలహాలు, సూచనల కోసం సంస్థ కా ర్యాలయం, మండల న్యాయ సేవా కమిటీల కా ర్యాలయాలను సంప్రదించాలని కోరారు.