ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి
రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్‌రావు అన్నారు. మాక్లూర్ మండలంలోని గంగరమంద గ్రామంలో సింగిల్ విండో ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన గురువారం ప్రారంభించారు.
మాక్లూర్/ ఇందల్వాయి/ నిజామాబాద్ రూరల్/ మోపాల్ (ఖలీల్‌వాడి)/ భీమ్‌గల్/ వేల్పూర్, ఏప్రిల్ 21 :
రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్‌రావు అన్నారు. మాక్లూర్ మండలంలోని గంగరమంద గ్రామంలో సింగిల్ విండో ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన గురువారం ప్రారంభించారు. చిన్నాపూర్‌లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు సత్యనారాయణ, సర్పంచ్ లక్ష్మి, ముల్లంగి(బీ)లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని విండో డైరెక్టర్ బూరోళ్ల అశోక్, సర్పంచ్ పావని, ఎంపీటీసీ పూజిత ప్రాంరభించారు.
ఇందల్వాయి మండలం చంద్రాయన్పల్లి, గన్నారం, రూప్లానాయక్ తండా గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఐడీసీఎంఎస్ చైర్మన్ సాంబారి మోహన్, ఎంపీపీ రమేశ్నాయక్తో కలిసి ధర్పల్లి జడ్పీటీసీ బాజిరెడ్డి జగన్ ప్రారంభించారు. దళారులకు ధాన్యం విక్రయించొద్దని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలని రైతులకు సూచించారు.
ఆయా గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన బాజిరెడ్డి జగన్ స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి సీఎం కేసీఆర్, ఆర్టీసీచైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చిత్రపటాలకుక్షీరాభిషేకం చేశారు.
నిజామాబాద్ రూరల్ మండలంలోని లింగి తండాలో ముత్తకుంట సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని ఎంపీపీ బానోత్ అనూషాప్రేమ్దాస్నాయక్, సొసైటీ చైర్మన్ స్వామి, స్థానిక సర్పంచ్ అరుణాసాయిలు ప్రారంభించారు. మోపాల్ మండలం బోర్గాం సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని డీసీసీబీ డైరెక్టర్, సొసైటీ చైర్మన్ చంద్రశేఖర్‌రెడ్డి ప్రారంభించారు.
భీమ్‌గల్ మండలంలోని జాగిర్యాల్ గ్రామంలో సొసైటీ చైర్మన్ శివసారి నర్సయ్య, గోన్‌గొప్పుల గ్రామంలో ఎంపీపీ ఆర్మూర్ మహేశ్, జడ్పీటీసీ రవి ప్రారంభించారు. వేల్పూర్ మండలంలోని మోతె, అక్లూర్, పచ్చల నడ్కుడ గ్రామాల్లో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను జడ్పీటీసీ సభ్యురాలు అల్లకొండ భారతి ప్రారంభించారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
HCA | అక్రమాలు, అన్యాయాలకు కేరాఫ్ హెచ్‌సీఏ .. జీవన్‌రెడ్డి ఎలా సెక్రటరీ అయ్యాడు..? టీసీఏ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెసరు విజయ్‌చందర్‌రెడ్డి
SA vs AUS | ఆసీస్ ఇన్నింగ్స్ డిక్లేర్.. భారీ ఛేదనలో సఫారీలకు హేజిల్‌వుడ్ షాక్..!
Plank Exercise | ప్లాంక్ వ్యాయామాన్ని అసలు ఎలా చేయాలి.. దీంతో కలిగే లాభాలేమిటి..?
Srivari Temple | ఖమ్మంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి శ్రీకారం..పవిత్ర క్రతువును నిర్వహించిన త్రిదండి చిన్నజీయర్‌స్వామి
Srisailam Dam | శ్రీశైలం డ్యామ్‌కు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

