ఫూలే ఆశయ సాధనకు కృషిచేయాలి
మహాత్మాజ్యోతి బాఫూలే చూసిన బాటలో పయనిస్తూ, ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్ నారాయణరెడ్డి పిలుపునిచ్చారు.
నిజామాబాద్ సిటీ, ఏప్రిల్ 11 : మహాత్మాజ్యోతి బాఫూలే చూసిన బాటలో పయనిస్తూ, ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్ నారాయణరెడ్డి పిలుపునిచ్చారు. పూలే 196వ జయంతి వేడుకలను జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో న్యూ అంబేద్కర్ భవన్లో సోమవారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా కలెక్టర్ నారాయణరెడ్డి, సీపీ నాగరాజు, నగర మేయర్ నీతూ కిరణ్ హాజరయ్యారు. జ్యోతిబా ఫూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం కలెక్టర్ నారాయణరెడ్డి మాట్లాడుతూ.. ఫూలే స్ఫూర్తితో నేటి విద్యార్థులు, యువత విద్యను ఆయుధంగా మలచుకుంటే చక్కటి భవిష్యత్‌ను పొందవచ్చన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 80వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిందని, ఈ అవకాశాన్ని నిరుద్యోగు లు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో అందించే ఉచిత కోచింగ్‌ను సద్వినియోగం చేసుకొని నిజామాబాద్ నుంచి అత్యధికంగా ఉద్యోగాలు సాధించి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. వ్యాసరచన, పెయింటింగ్ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు కలెక్టర్, సీపీ బహుమతులను ప్రదానం చేసి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు చిత్రామిశ్రా, చంద్రశేఖర్, బీసీ నాయకులు నరాల సుధాకర్, వినోద్‌కుమార్, రాజేశ్వర్, మారయ్యగౌడ్, జిల్లా అధికారులు, విద్యార్ధులు పాల్గొన్నారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
HCA | అక్రమాలు, అన్యాయాలకు కేరాఫ్ హెచ్‌సీఏ .. జీవన్‌రెడ్డి ఎలా సెక్రటరీ అయ్యాడు..? టీసీఏ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెసరు విజయ్‌చందర్‌రెడ్డి
SA vs AUS | ఆసీస్ ఇన్నింగ్స్ డిక్లేర్.. భారీ ఛేదనలో సఫారీలకు హేజిల్‌వుడ్ షాక్..!
Plank Exercise | ప్లాంక్ వ్యాయామాన్ని అసలు ఎలా చేయాలి.. దీంతో కలిగే లాభాలేమిటి..?
Srivari Temple | ఖమ్మంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి శ్రీకారం..పవిత్ర క్రతువును నిర్వహించిన త్రిదండి చిన్నజీయర్‌స్వామి
Srisailam Dam | శ్రీశైలం డ్యామ్‌కు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

