ఉల్లిగడ్డలు @ దోన్పాల్!
మండలంలోని దోన్పాల్ ఉల్లిగడ్డల ఊరుగా పేరొందింది. దీనికి కారణం ఈగ్రామంలో ఏటా ఉల్లిగడ్డల పంటను వేయడం, వివిధ గ్రామాలకు వెళ్లి విక్రయించడం.
- వరికి ప్రత్యామ్నాయంగా రైతుల సాగు
- చేతికి వచ్చిన పంట
- అమ్మకానికి సిద్ధంగా ఉల్లిగడ్డలు
మోర్తాడ్, మార్చి15: మండలంలోని దోన్పాల్ ఉల్లిగడ్డల ఊరుగా పేరొందింది. దీనికి కారణం ఈగ్రామంలో ఏటా ఉల్లిగడ్డల పంటను వేయడం, వివిధ గ్రామాలకు వెళ్లి విక్రయించడం. ఈసారి కూడా దాదాపు 40 మంది రైతులు ఉల్లిగడ్డ పంటను పండించారు. పంట ఇప్పుడిప్పుడే చేతికి వస్తున్నది. పంట బాగా పండడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
గ్రామంలోనే విక్రయాలు
ఉల్లిగడ్డ పంటను పండించిన రైతులు గ్రామంలోనే ఉల్లిగడ్డలను అమ్ముతారు. ప్రస్తుతం వంద రూపాయలకు ఆరుకిలోల వరకు విక్రయిస్తున్నారు. లేదా 50కిలోల బస్తాను రూ.600 నుంచి రూ.750వరకు డిమాండ్‌ను బట్టి విక్రయిస్తుంటారు. తెలిసిన వారు చుట్టు పక్కల గ్రామాల నుంచి దోన్పాల్ గ్రామానికి వచ్చి ఉల్లిగడ్డలను కొనుగోలు చేస్తుంటారు. అంతేగాక ఇక్కడి రైతులు మోర్తాడ్, బాల్కొండ, మెట్పల్లి, భీమ్‌గల్ తదితర ప్రాంతాల్లో అంగడి సమయాల్లో వెళ్లి విక్రయిస్తుంటారు. ఇక్కడ ఉల్లిగడ్డను పండించే రైతులు మందులను వాడకుండా చాలా మంది కేవలం బూడిదను ఉపయోగిస్తుంటారు. దీంతో ఉల్లిగడ్డ ఎక్కువకాలం చెడిపోకుండా ఉంటుందని రైతులు అంటున్నారు.
ధర పర్వాలేదు..
ఏండ్ల నుంచి ఉల్లిగడ్డను పండిస్తున్నాం. కానీ గతేడాది నుంచి ధర పర్వాలేదనిపిస్తుంది. అంతకు ముందు కిలో పది రూపాయలకే అమ్మెటోళ్లం. లాభాలు ఎక్కువ ఉండేవి కాదు. ఇప్పుడు కిలో రూ.15 నుంచి 17 వరకు ఉన్నందున పంట పండించినందుకు పర్వాలేదనిపిస్తుంది.
-గంగసాయన్న, దోన్పాల్
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
HCA | అక్రమాలు, అన్యాయాలకు కేరాఫ్ హెచ్‌సీఏ .. జీవన్‌రెడ్డి ఎలా సెక్రటరీ అయ్యాడు..? టీసీఏ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెసరు విజయ్‌చందర్‌రెడ్డి
SA vs AUS | ఆసీస్ ఇన్నింగ్స్ డిక్లేర్.. భారీ ఛేదనలో సఫారీలకు హేజిల్‌వుడ్ షాక్..!
Plank Exercise | ప్లాంక్ వ్యాయామాన్ని అసలు ఎలా చేయాలి.. దీంతో కలిగే లాభాలేమిటి..?
Srivari Temple | ఖమ్మంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి శ్రీకారం..పవిత్ర క్రతువును నిర్వహించిన త్రిదండి చిన్నజీయర్‌స్వామి
Srisailam Dam | శ్రీశైలం డ్యామ్‌కు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

