అర్వపల్లి, జూలై 23 : జాజిరెడ్డిగూడెం మండలం సర్పంచుల ఫోరం అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన లోయపల్లి గ్రామ సర్పంచ్ వల్లపు గంగయ్యను గురువారం అర్వపల్లిలోని బీఆర్ఎస్ మండల పార్టీ కార్యాలయంలో తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిశోర్ కుమార్ శాలువాతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే బీఆర్ఎస్ సర్పంచులు, నాయకులు కిశోర్ కుమార్ను గజమాలతో సత్కరించారు. అనంతరం కొమ్మాల గ్రామంలో బిఆర్ఎస్ యువజన విభాగం నాయకుడు సూరారపు అజయ్ రోడ్డు ప్రమాదంలో మరణించగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
ఈ కార్యక్రమంలో మండలాధ్యక్షుడు గుండగాని సోమేష్ గౌడ్, మాజీ జడ్పీటీసీ దావుల వీరప్రసాద్ యాదవ్, మారిపెద్ది శ్రీనివాస్ గౌడ్, మొరిశెట్టి ఉపేందర్, యుగేందర్, రామలింగయ్య, సర్పంచులు కర్నాటి వెంకన్, అంకిరెడ్డి వీరాంజనేయులు, బానోతు సైదులు, కలకోట్ల శైలేందర్, నున్న యాదగిరి, మేడి వీరస్వామి, బొడ్డు సోమరాజు, కేలోతు హరిలాల్, చంద్రశేఖర్ రెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షులు కట్టెల మల్లేష్, గోసుల విజయ్ కుమార్, సంపతి కిరణ్ కుమార్, దుబ్బాక ఎల్లంరాజు, ఓర్సు వెంకన్న, రవీందర్, మల్లయ్య, రంగయ్య, ప్రభు, నరేష్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

వల్లపు గంగయ్యకు మాజీ ఎమ్మెల్యే కిశోర్ కుమార్ సన్మానం