ఖలీల్‌వాడి, అక్టోబర్ 5 : అన్ని వర్గాల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా అన్నారు. నగరంలోని ఇంద్రాపూర్‌లో నగర యాద వ సంఘం కమ్యూనిటీ హాల్, వినాయక్‌నగర్‌లో కుర్మ సంఘ కమ్యూనిటీహాల్, వంజరి సంఘం కమ్యూనిటీ హాల్, గురుద్వారా వద్ద సిక్కు కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి గురువారం భూమి పూజ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ కులవృత్తులకు మళ్లీ జీవం పోశారన్నారు. నగరంలో కులమతాలకతీతంగా అభివృద్ధి జరుగుతుందని, ఒకవైపు జిల్లా అభివృద్ధి మరోవైపు కులసంఘాల అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తున్నామని, ఆత్మగౌరవానికి ప్రతీకగా కులసంఘాల భవనాలు నిర్మిస్తున్నామన్నారు. 25 కిలోమీటర్ల మేర సెంటర్ మీడియాన్ లైట్లు ఏర్పాటు చేశామని, ఆధునిక సదుపాయాలతో వైకుంఠధామాలు, ఆహ్లాదకరమైన వాతావరణంలో మినీట్యాంక్‌బండ్ ని ర్మించామని, యువతకు ఉపాధి కల్పించడానికి ఐటీ హబ్‌ను ఏర్పాటు చేశామన్నారు. అనంతరం రూ. కోటితో ప్రెస్‌క్లబ్ భవనానికి, రూ. 3 కోట్లతో క్రీడా ప్రాంగణ నిర్మాణానికి భూమిపూజ చేశారు. సబ్సిడీపై గొర్రెల యూనిట్లను పంపిణీ చేశారు. కార్యక్రమాల్లో మేయర్ నీతూ కిరణ్, సుజీత్‌సింగ్ ఠాకూర్, కార్పొరేటర్లు, నాయకులు పాల్గొన్నారు.