చందూర్/రుద్రూర్/ కోటగిరి, డిసెంబర్ 17 : జిల్లాలోని పలు గ్రామాల్లో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పోచారం సురేందర్‌రెడ్డి జన్మదిన వేడుకలను నాయకులు, కార్యకర్తలు శనివారం ఘనంగా నిర్వహించారు. మోస్రా మండలకేంద్రంలో నాయకులు కేక్ కట్ చేసి, స్వీట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యుడు గుత్ప విజయభాస్కర్‌రెడ్డి, ఎంపీపీ పిట్ల ఉమాశ్రీ రాములు, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు హన్మంత్‌రెడ్డి, సొసైటీ చైర్మన్ సుధాకర్‌రెడ్డి, సాయాగౌడ్, ఫిరోజ్ పాల్గొన్నారు.
రుద్రూర్ మండల కేంద్రంలోని బస్టాండ్ సమీపంలో నాయకులు కేక్ కట్ చేసి సురేందర్‌రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మండలంలోని అన్ని గ్రామాల్లో వేడుకలను నిర్వహించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యుడు నారోజి గంగారాం, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పత్తి లక్ష్మణ్, కార్యదర్శి బాలరాజు, విండో మాజీ చైర్మన్ పత్తి రాము, వైస్ ఎంపీపీ సాయిలు, విండో చైర్మన్ సంజీవ్‌రెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షుడు తొట్ల గంగారాం, సోషల్ మీడియా ఇన్చార్జి లాల్‌మహ్మద్ పాల్గొన్నారు.
కోటగిరి, పొతంగల్, కొత్తపల్లి, హంగర్గాఫారం, టాక్లీతో పాటు వివిధ గ్రామాల్లో కేక్ కట్ చేసి, పటాకులు కాల్చి జన్మదిన వేడుకలను నిర్వహించారు. కార్యక్రమంలో కోటగిరి, పొతంగల్ మండల ప్రజాప్రతినిధులు, మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
చందూర్‌లో కేట్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల, గ్రామ అధ్యక్షులు అంబర్‌సింగ్, ప్యారం అశోక్, సర్పంచులు కర్లం సాయారెడ్డి, దేవీసింగ్, రవి , సొసైటీ చైర్మన్ మాధవరెడ్డి పాల్గొన్నారు.
మోస్రా మండలంలోని చింతకుంటలో ఉన్న అనాథాశ్రమంలో వృద్ధులకు బీఆర్ఎస్ వర్ని గ్రామ శాఖ ఉపాధ్యక్షుడు అజీమ్.. నాయకులతో కలిసి అల్పాహారం అందజేశారు.
వర్ని మండల కేంద్రంలో నాయకులు కేక్ కట్‌చేసి కార్యకర్తలకు పంచిపెట్టారు. పటాకులు కాల్చి సంబురాలు నిర్వహించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ బర్దావల్ హరిదాస్, ఎంపీపీ మేక శ్రీలక్ష్మీవీర్రాజు, వైస్ ఎంపీపీ దండ్ల బాలరాజు, ఏఎంసీ చైర్మన్ కవితా అంబర్‌సింగ్, వైస్ చైర్మన్ వెలగపూడి గోపాల్, బీఆర్ఎస్ నాయకులు కల్లాలి గిరి, వంకా నగేశ్, పెనిమర్తి శ్రీహరి, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.