మాక్లూర్, డిసెంబర్14: బాల్య వివాహాలతో కలిగే అనర్థాలను మండల కేంద్రంలోని కేజీబీవీలో బుధవారం ఐసీడీఎస్ అధికారులు విద్యార్థినులకు వివరించారు. ఈ సందర్భంగా ఐసీపీఎస్ బాబు, ఐసీడీఎస్ సూపర్వైజర్ వరలక్ష్మి మాట్లాడుతూ బాల్య వివాహాలు ఎక్కడైనా చేసినట్లు తెలిస్తే అధికారులకు సమాచారం అందించాలని సూచించారు. మహిళలు, బాలికలపై లైంగిక వేధింపులు, ఆడపిల్లల అక్రమ రవాణాపై వివరించారు. హైల్త్ అండ్ హైజనిక్ కార్యక్రమంలో భాగంగా చేతులను శుభ్రంగా కడుక్కో వడం, ఫౌష్టికాహారం భుజించడంతో కలిగే ఆరోగ్య పరమైన అంశాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఎస్వో ప్రగతి, దేవపాల, ముజాయిత్, సుధాకర్, ఏఎస్సైలు పీరుబాయి, రాథోడ్, ఉపాధ్యాయినులు, పాల్గొన్నారు.