వర్ని, నవంబర్ 15 : రాష్ట్రంలో ప్రతి గుంటకు సాగు నీరందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తున్నదని రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి అన్నారు. వర్ని మండలం జాకోరా గ్రామం వద్ద నిర్మిస్తున్న ఎత్తిపోతల పథకం పంప్‌హౌస్ నిర్మాణానికి మంగళవారం ఆయన భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాన్సువాడ నియోజకవర్గంలో ఇప్పటికే 90 శాతం వ్యవసాయ భూములకు సాగునీరందుతుందన్నారు. మిగిలిన భూములకు కూడా సాగు నీరందించేందుకు కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. పనులు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. అనంతరం ఎత్తిపోతల పథకం పనుల వివరాలను ఇరిగేషన్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో వర్ని జడ్పీటీసీ బర్దావల్ హరిదాస్, వైస్ ఎంపీపీ దండ్ల బాలరాజు, ఏఎంసీ వైస్ చైర్మన్ వెలగపూడి గోపాల్, రైతు బంధు సమితి మండల అధ్యక్షుడు గంగారాం, సహకార సంఘం అధ్యక్షుడు నామాల సాయిబాబా, సర్పంచ్ కొర్వ గోదావరీ గణేశ్, ఆర్డీవో రాజేశ్వర్, ఇరిగేషన్, ఇతర శాఖల అధికారులు, టీఆర్ఎస్ (బీఆర్ఎస్) నాయకులు మేక వీర్రాజు, కల్లాలి గిరి తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించాలి
కోట్లాది రూపాయలు వెచ్చించి ప్రభుత్వం నిర్మిస్తున్న భవనాలను స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులు, అధికారులు రక్షించాలని సూచించా రు. జాకోరలో నిర్మించిన ప్రభుత్వ కల్యాణ మండ పం నిరుపయోగంగా ఉండడాన్ని గమనించిన స్పీకర్ భవనాన్ని పరిశీలించి నాయకులు, ప్రజా ప్రతినిధులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే శుభ్ర పరిచి ఉపయోగంలోకి సూచించారు.