బాల్కొండ/మోర్తాడ్/ఆర్మూర్/వేల్పూర్, నవంబర్ 12: పేదలకు సీఎంఆర్ఎఫ్ అండగా నిలుస్తోందని ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్(బీఆర్ఎస్) పార్టీ నాయకులు అన్నారు. శనివారం పలు మండలాల్లో లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. బాల్కొండ మండలంలోని పలు గ్రామాలకు చెందిన వారికి శనివారం మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులను పార్టీ మండల అధ్యక్షుడు బద్దం ప్రవీణ్‌రెడ్డి అందజేసి మాట్లాడారు. రాష్ట్ర రోడ్లు, భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి సహకారంతో సీఎం సహాయనిధి ద్వారా పేద, సామాన్య ప్రజలకు మెరుగైన వైద్యమందుతుందన్నారు. అనారోగ్యంతో దవాఖానలో చేరిన పేదలకు సీఎం సహాయనిధితో మెరుగైన వైద్యం అందుతోందని అన్నారు. ఆరు కుటుంబాలకు మంత్రి ప్రత్యేక చొరవతో మంజూరైన రూ.2,77,500 విలువైన సీఎంఆర్ఎస్ చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో ఎంపీపీ లావణ్య లింగాగౌడ్, జడ్పీటీసీ దాసరి లావణ్య వెంకటేశ్, వైస్ ఎంపీపీ శ్రీకాంత్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
కమ్మర్పల్లి మండలం బషీరాబాద్‌లో అదే గ్రామానికి చెందిన మారంపల్లి బావులుకు రూ.35వేల సీఎంఆర్ఎఫ్ చెక్కును సర్పంచ్ సక్కారం అశోక్ లబ్ధిదారుడి ఇంటికి వెళ్లి అందజేశారు. హాసాకొత్తూర్ గ్రామంలో పడిగెల అశోక్‌కు రూ.18వేలు, గణేశ్ కుటుంబ సభ్యులకు రూ.50వేల చెక్కులను వారి ఇంటికే వెళ్లి టీఆర్ఎస్(బీఆర్ఎస్) గ్రామశాఖ అధ్యక్షుడు తెడ్డు కిరిటీ, ఉప సర్పంచ్ ఏనుగు రాజేశ్వర్, మాజీ ఎంపీటీసీ తెడ్డు రాజన్న అందజేశారు.
ఆర్మూర్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్‌లో సీఎంఆర్ఎఫ్ చెక్కులను పార్టీ మైనార్టీ నాయకులు పంపిణీ చేశారు. మైనార్టీ నాయకులు సుమీర్ అహ్మద్, నీహాలుద్దీన్ సాహబ్ తురబ్ అలీ, సాహబ్ మహ్మద్ ఆదిల్ తదితరులు పాల్గొన్నారు.
వేల్పూర్ మండల కేంద్రంలో పలువురికి టీఆర్ఎస్ నాయకులు సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. గ్రామానికి చెందిన జి.లక్ష్మికి రూ.2లక్షలు, రమాదేవికి రూ.1.50లక్షలు, సీహెచ్.బాలయ్యకు రూ.1.25 లక్షలు, జి.గంగామణికి రూ.లక్ష, ఎం.గిరి చైతన్య తేజకు రూ.76 వేలు, ఎ.కవితకు రూ.41,500, పి.లావణ్యకు రూ.35 వేలు, పి.శ్రీనివాస్‌కు రూ.33 వేలు, ఎన్.భవానికి రూ.27,500, ఎ.మేఘనకు రూ.27వేలు, ఎన్.లక్ష్మికి రూ.20,500 విలువైన చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో ఆర్టీఏ సభ్యుడు రేగుల రాములు, పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు ప్రతాప్, ఎంపీటీసీ మొండి మహేశ్, ఉపసర్పంచ్ పిట్ల సత్యం, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.