విద్యానగర్/మాచారెడ్డి/నస్రుల్లాబాద్/పిట్లం/ఎల్లారెడ్డి/ తాడ్వాయి, అక్టోబర్ 30 : మునుగోడు ఉప ఎన్నికలో భాగంగా ఆదివారం జిల్లా నాయకులు జోరుగా ప్రచారం చేశారు. ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ గట్టుప్పల్‌లో ఉదయం 6 గంటల నుంచి ప్రధాన వీధుల వెంట తిరుగుతూ ఓటర్లను కలుస్తూ ప్రచారం నిర్వహించారు. మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్(బీఆర్ఎస్) అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిని గెలిపించాలని ఇంటింటికీ వెళ్లి ప్రచారం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాల గురించి అవగాహన కల్పించారు. కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.
ప్రచారంలో టీఆర్ఎస్(బీఆర్ఎస్) రాష్ట్ర నాయకుడు నిట్టు వేణుగోపాల్‌రావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పున్న రాజేశ్వర్, మాచారెడ్డి ఎంపీపీ లోయపల్లి నర్సింగ్‌రావు, టీఆర్ఎస్(బీఆర్ఎస్) నాయకులు జూకంటి ప్రభాకర్‌రెడ్డి, గెరిగంటి లక్ష్మీనారాయణ, మాసుల లక్ష్మీనారాయణ, గండ్ర మధుసూదన్‌రెడ్డి, నల్లవెల్లి అశోక్, టీఆర్ఎస్(బీఆర్ఎస్) పార్టీ మాచారెడ్డి మండల ప్రధానకార్యదర్శి రాజాగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
నస్రుల్లాబాద్ మండల నాయకులు చౌటుప్పల్ మండలం చిన్న కొండూర్, తూర్ప గూడెంలో ప్రచారం చేశారు. ఈ ప్రచారంలో ఎంపీపీ పాల్త్య విఠల్, టీఆర్ఎస్(బీఆర్ఎస్) పార్టీ మండల అధ్యక్షుడు పెర్క శ్రీనివాస్, జడ్పీ కో-ఆప్షన్ సభ్యుడు మాజిద్, నాయకులు ప్రతాప్ సింగ్, కంది మల్లేశ్, అఫ్రోజ్ తదితరులు ఉన్నారు.
పిట్లం మండల టీఆర్ఎస్(బీఆర్ఎస్) నాయకుడు అన్నారం వెంకట్రాంరెడ్డి కమ్మగూడెం గ్రామం లో నమూనా ఈవీఎంతో ఇంటింటికీ తిరుగుతూ టీఆర్ఎస్(టీఆర్ఎస్) పార్టీ అభ్యర్థి ప్రభాకర్‌రెడ్డిని గెలిపించాలని ప్రచారం చేశారు. కార్యక్రమంలో విండో చైర్మన్లు నారాయణరెడ్డి, సాయిరెడ్డి, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు నారాయణరెడ్డి, ఏఎంసీ డైరెక్టర్ మహిపాల్‌రెడ్డి, బంజారా నాయకుడు బాబూసింగ్ తదితరులు పాల్గొన్నారు.
ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్ ఆదేశాల మేరకు ఎల్లారెడ్డి మండల నాయకులు మునుగోడు నియోజకవర్గం లోని పులిపలుపుల గ్రామంలో ప్రచారం చేశారు. ప్రచారంలో ఎల్లారెడ్డి మున్సిపల్ వార్డు కౌన్సిలర్ భూంగారి రాము తదితరులు పాల్గొన్నారు. తాడ్వాయి మండల టీఆర్ఎస్(బీఆర్ఎస్) నాయకులు చండూరు, మునుగోడు మండలాల్లో ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో ఏఎంసీ చైర్మన్ సాయిరెడ్డి, సీడీసీ చైర్మన్ మహిందర్‌రెడ్డి, విండో చైర్మన్ కపిల్రెడ్డితోపాటు గోపాల్‌రావు, రమేశ్‌రావు, ధర్మారెడ్డి, మంగారెడ్డి, లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.