రెంజల్, అక్టోబర్ 29: బీజేపీ అంటే భారతీయ జూఠా పార్టీగా అని బోధన్ ఎమ్మెల్యే షకీల్ ఆరోపించారు. మన ఊరు – మన ఎమ్మెల్యే కార్యక్రమంలో భాగంగా శనివారం పేపర్‌మిల్, కందకుర్తి గ్రామాల్లో ఏర్పాటు చేసిన సభల్లో ఎమ్మెల్యే మాట్లాడారు. అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా కేసీఆర్ పని చేస్తున్నారని అన్నారు. బీజేపీ ప్రభుత్వం జీఎస్టీ పేరుతో పేదల కడుపు కొడుతోందని మండిపడ్డారు. పేపర్‌మిల్‌లో రూ. 20 లక్షల వ్యయంతో నిర్మించిన జీపీ భవనం, అంగన్వాడీ భవనాలను ప్రారంభించారు. గ్రామానికి 30 డబుల్ బెడ్రూం ఇండ్లను మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు.
రూ.20లక్షలతో సీసీ రోడ్లు మంజూరు చేశారు. పేపర్‌మిల్ గ్రామ శివారులో 2020 జనవరి 20న గుంతలో పడి ముగ్గురు చిన్నారుల ప్రాణాలు కోల్పోగా బాధిత కుటుంబానికి దళిత బంధు పథకం అందిస్తానని ఎమ్మెల్యే ప్రకటించారు. గ్రామాల వారీగా ప్రజలు అందించిన అర్జీలను ఎమ్మెల్యే స్వీకరించారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ రజితా యాదవ్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు భూమారెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ గిర్ధావార్గంగారెడ్డి, సర్పంచులు ఖలీంబేగ్, అలీమా బేగం, వికార్‌పాషా, రమేశ్‌కుమార్, సాయిరెడ్డి, రాజు, గణేశ్‌నాయక్, సాయిలు, ఎంపీటీసీలు, మండల నాయకులు రఫిక్, రాఘవేందర్, నర్సయ్య, కాశం సాయిలు, సాయిరెడ్డి, చైర్మన్లు ఇమ్రాన్బేగ్, మొహినుద్దీన్ పాల్గొన్నారు. ప్రతి ధాన్యం గింజనూ ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరతో కొనుగోలు చేస్తామని ఎమ్మెల్యే షకీల్ పేర్కొన్నారు. రెంజల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. సర్పంచ్ రమేశ్‌కుమార్, తహసీల్దార్ రాంచందర్, ఎంపీడీవో శంకర్, డైరెక్టర్లు పాల్గొన్నారు.