ఆర్మూర్/మాక్లూర్/కోటగిరి/రుద్రూర్ /చందూర్, అక్టోబర్ 18: ఉప ఎన్నికలో భాగంగా జిల్లాకు చెందిన టీఆర్ఎస్(బీఆర్ఎస్) పార్టీ నాయకులు మంగళవారం మునుగోడులో ప్రచారం నిర్వహించారు. పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి గెలుపొందాలని కోరుతూ ఆందోల్ మైసమ్మ ఆలయంలో రాష్ట్ర నాయకుడు ఆశన్నగారి రాజేశ్వర్‌రెడ్డి ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు. ఆర్మూర్ ఎంపీపీ పస్క నర్సయ్య, ఆర్మూర్ మండల నాయకులు పండిత్ పవన్, వాంకిడి సంతోష్, సర్పంచ్ యాదగిరి, గుంజిలి రంజిత్,గ డ్డం మహేశ్, నర్మె నవీన్, నాయకులు పాల్గొన్నారు. మాక్లూర్ మండల ఎంపీటీసీలు సత్యనారాయణ, ఒడ్డెన్న, నారాయణ పాల్గొన్నారు.
చౌటప్పల్ మండలం చిన్న కొండూరు గ్రామంలో డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్‌రెడ్డి ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేశారు. మునుగోడు అభివృద్ధికి టీఆర్ఎస్(బీఆర్ఎస్) అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. ఆయన వెంట కోటగిరి, రుద్రూర్ మండలాల నాయకులు వల్లేపల్లి శ్రీనివాస్‌రావు, నీరడి గంగాధర్, పి.సాయిలు, నాగేందర్, నారోజీ గంగారాం, రాజు, హన్మంత్‌రెడ్డి, అంజిరెడ్డి, విజయ్‌పటేల్, అక్కపల్లి నాగేందర్, సంజీవ్, రామాగౌడ్ ఉన్నారు. గొర్రెలు, మేకలు కార్పొరేషన్ చైర్మన్ బాల్‌రాజ్ యాదవ్‌తో కలిసి రుద్రూర్ మండల నాయకులు ప్రచారం నిర్వహించారు. చందూర్ మండలానికి చెందిన టీఆర్ఎస్ (బీఆర్ఎస్) నాయకులు ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరిస్తూ ప్రచారం చేశారు. నాయకులు అంబర్‌సింగ్, బొడ్డోల్ల సత్యనారాయణ తదితరులు ప్రచారంలో పాల్గొన్నారు.