డిచ్పల్లి/ ఇందల్వాయి, అక్టోబర్ 9 : డిచ్పల్లి మండలంలోని సుద్దపల్లిలో ఊరపండుగను ఆదివారం ఘనంగా నిర్వహించారు. అమ్మవార్ల విగ్రహాలను డప్పు వాయిద్యాల మధ్య ఊరేగించి గంగాజలంతో అభిషేకం చేశారు. అనంతరం గ్రామదేవతలకు భక్తులు ప్రత్యేకపూజలు చేశారు. ఊరేగింపులో పోతరాజుల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. అనంతరం గ్రామదేవతలకు బలిహరణ నిర్వహించారు.
అనంతరం గ్రామస్తులు వనభోజనాలకు తరలివెళ్లారు. పంటలు బాగా పండాలని, గ్రామస్తులు ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రతి ఏడాది ఊర పండుగను నిర్వహిస్తామని వీడీసీ సభ్యులు తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ రూపా సతీశ్‌రెడ్డి, ఎంపీటీసీ సభ్యుడు ఎంబడి సంతోషం, ఉపసర్పంచ్ గంగారాం, సొసైటీ వైస్ చైర్మన్ కుమ్మరి చిన్నగంగారాం, వీడీసీ సభ్యులు ఎంబడి రెడ్డి, నరహరి, గ్రామస్తులు పాల్గొన్నారు.
ఇందల్వాయి మండలంలోని గన్నారంలో గ్రామదేవతలకు ఆదివారం ప్రత్యేకపూజలు నిర్వహించారు. పంట లు బాగా పండాలని, ప్రజలు సుఖశాంతులతో ఉండాలని కో రుతూ గ్రామదేవతలకు ఖుషీ పండుగ నిర్వహించినట్లు గ్రామపెద్దలు తెలిపారు. కార్యక్రమం లో సర్పంచ్ కుంట మోహన్‌రె డ్డి, ఎంపీటీసీ సభ్యురాలు లావణ్యారవి, ఉపసర్పంచ్ భైరయ్య, వీడీసీ సభ్యులు పాల్గొన్నారు.