భీమ్‌గల్, సెప్టెంబర్ 24: మండలంలోని లింబాద్రి లక్ష్మీ నరసింహ స్వామిని హైకోర్టు న్యాయమూర్తి శ్రీ సుధ దర్శించుకున్నారు. శనివారం ఆమె నిజామాబాద్ జిల్లా న్యామమూర్తి కుంచాల సునీతతో కలిసి స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకుముందు న్యాయమూర్తులకు ఆలయ ప్రధాన అర్చకుడు నంబి పార్థసారథి వేదమంత్రాలతో సాదరంగా ఆహ్వానించారు. స్వామివారి చిత్రపటం, పట్టువస్ర్తాలను అందజేశారు. ఆలయ చరిత్రను జడ్జికి వివరించారు.
ఈ సందర్భంగా హైకోర్టు న్యాయమూర్తి శ్రీ సుధ మాట్లాడుతూ.. మొదటిసారిగా 2003లో స్వామివారిని దర్శించుకున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆర్మూర్ బార్ అసోషియేషన్ అధ్యక్షుడు గంట విప్లవ్ కిరణ్ అధ్వర్యంలో హైకోర్టు జడ్జిని ఘనంగా సన్మానించారు. జడ్జి వెంట అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి దీప్తి, జిల్లా జడ్జి భవ్య, ఆర్డీవో శ్రీనివాసులు,ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్ సోమయ్య, ఏసీపీ ప్రభాకర్‌రావు, తహసీల్దార్ శ్రీధర్, అడిషనల్ పీపీ ఎంకె నరేందర్ ఉన్నారు.