కోటగిరి/మోస్రా (చందూర్)/ ఖలీల్‌వాడి/నందిపేట్/రెంజల్, సెప్టెంబర్ 17 :రాష్ట్ర నూతన సచివాలయానికి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టడంపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ చిత్రపటాలకు శనివారం క్షీరాభిషేకాలు చేసి కృతజ్ఞతలు తెలిపారు. కోటగిరి మండలకేంద్రంలో దళిత సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్, సీఎం కేసీఆర్, స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు.
కార్యక్రమంలో దళిత సంఘం నాయకులు మిర్జాపురం చిన్న సాయన్న, కాలే సాయిలు, దావులయ్య, ఆర్టీసీ సాయిలు, పుప్పాల సాయిలు, జంగం సాయిలు, గోపు సాయిలు, వైస్ ఎంపీపీ గంగాధర్‌పటేల్, విజిలెన్స్ జిల్లా కమిటీ సభ్యురాలు హెచ్.స్వరూప, మండల కన్వీనర్ ఎజాజ్‌ఖాన్, వల్లెపల్లి శ్రీనివాస్, కొల్లూర్ కిశోర్‌బాబు, ఇస్మాయిల్, ఎంపీటీసీలు కేశ వీరేశం, విఠల్ తదితరులు పాల్గొన్నారు.
మోస్రా మండలంలోని చింతకుంటలో జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం దళిత సంఘాల నాయకులు, గ్రామస్తులు సీఎం కేసీఆర్, స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ విమలాలింగయ్య, ఉపసర్పంచ్ స్వామి, నాయకులు పాల్గొన్నారు.
జిల్లాకేంద్రంలోని పూలాంగ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి, సీఎం కేసీఆర్ చిత్రపటాలకు మాల మహానాడు ఆధ్వర్యంలో క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో మాలమహానాడు జిల్లా అధ్యక్షుడు ఎల్లయ్య, ఉపాధ్యక్షుడు బత్తుల కిష్టయ్య, అసద్, గంగాధర్, చంద్రమోహన్, నాయకులు నల్ల బాలరాజు, సహాయ కార్యదర్శి వెంకటరమణ, జిల్లా మహిళా అధ్యక్షురాలు మాధవి, కరుణ, నిజామాబాద్ డివిజన్ అధ్యక్షుడు తలారి సాయన్న, నగర కమిటీ కోశాధికారి బట్టి గంగాధర్, నగర ఉపాధ్యక్షుడు టీవీ నారాయణ, బాలయ్య, బి.అనిల్, సాధు లక్ష్మణ్, గంగాధర్, వినీత్, మనోహర్ తదితరులు పాల్గొన్నారు.
నందిపేట్ మండలం వెల్మల్, రెంజల్ మండల కేంద్రంలో దళిత సంఘాల ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. నూతన పార్లమెంట్ భవనానికి అంబేద్కర్ పేరు పెట్టాలని రెంజల్ సర్పంచ్ రమేశ్‌కుమార్ కోరారు. కార్యక్రమాల్లో వెల్మల్ సర్పంచ్ మచ్చర్ల సాయమ్మ, విజిలెన్స్ కమిటీ సభ్యులు కోమన్‌పల్లి రాజన్న, దళిత సంఘాల నాయకులు ప్రభాకర్, సిద్ధ మోహన్, గంగారాం, రెంజల్ మండల టీఆర్ఎస్ నాయకులు రఫీక్, అనిల్, ముఖీద్, అవేస్బేగ్, వెల్మల్ గ్రామానికి చెందిన నాయకులు శ్రీధర్, సురేశ్, మచ్చర్ల గంగారాం పాల్గొన్నారు.
ఇందల్వాయి, సెప్టెంబర్ 17: గిరిజనులకు గిరిజన బంధు పథకం ప్రకటించడంతోపాటు ఆరు నుంచి పది శాతం వరకు రిజర్వేషన్‌ను పెంచడంపై గిరిజనులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని బంజారా భవన్ వద్ద ఏర్పాటు చేసిన సీఎం కేసీఆర్ కటౌట్‌కు ఇందల్వాయి ఎంపీపీ రమేశ్ నాయక్ క్షీరాభిషేకం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గిరిజన బంధుతోపాటు పోడుభూముల సమస్యలను పరిష్కరిస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో రైతుబంధు సమితి మండల కో-ఆర్డినేటర్ మోహన్‌నాయక్, అంబర్‌సింగ్, ఎంపీడీవో రాములునాయక్, రాంచందర్ నాయక్, దేవీనాయక్, మోహన్ నాయక్, కుమార్ నాయక్, పూర్యానాయక్ తదితరులు పాల్గొన్నారు.