బాల్కొండ/ముప్కాల్/మెండోరా, మార్చి 20: ఉద్యోగాల కల్పన, అభివృద్ధి, సంక్షేమ పథకాల్లో తెలంగాణ నంబర్ వన్ అని రాష్ట్ర రోడ్లు, భవనాలు, హౌసింగ్, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. బాల్కొండ మండలంలోని పలు గ్రామాల్లో ఆదివారం అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశాల్లో మంత్రి మాట్లాడారు. తమ ప్రభుత్వ హయాంలో రెండు లక్షల పది వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నదని చెప్పారు. కేటీఆర్ కృషితో 17వేల పరిశ్రమలు నెలకొల్పబడ్డాయని, తద్వారా రూ.16లక్షల మందికి ప్రైవేటు రంగంలోనూ ఉపాధి లభిస్తున్నదని చెప్పారు.తాను చెప్పింది అబద్ధమని నిరూపిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. అంతకు ముందు మంత్రి బాల్కొండలో రూ.50లక్షల వ్యయంతో చేపట్టే సీసీ రోడ్లతో పాటు మాల సంఘం, మున్నూరు కాపు సంఘం, మాదిగ సంఘం, నెహ్రూనగర్‌లో కమ్యూనిటీ భవనాల నిర్మాణాలకు శంకుస్థాపనలు చేశారు.
కిసాన్‌నగర్‌లో మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో కొనుగోలు చేసిన యంత్రాన్ని ప్రారంభించారు. కార్యక్రమాల్లో మండల ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు.
ముప్కాల్ మండలంలోని పలు గ్రామాల్లో అభివృద్ధి పనులకు మంత్రి శకుంస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా మంత్రికి ఆయా గ్రామాల్లో మంగళహారతులు, డప్పు వాయిద్యాలతో ఘన స్వాగతం పలికారు. వేంపల్లిలో రూ.పది లక్షలతో నిర్మించే కమ్యూనిటీ భవనం, రూ.నాలుగు లక్షలతో మాల సంఘ భవనాలను ప్రారంభించారు. సీసీ రోడ్లు, యాదవ, కుమ్మరి, గూండ్ల సంఘాలతో పాటు యూత్ బిల్డింగ్ నిర్మాణం కోసం శంకుస్థాపనలు చేశారు. ఏర్గట్లలో సీసీ రోడ్లు, పాఠశాల అదనపు తరగతి గదుల నిర్మాణాన్ని ప్రారంభించిన అనంతరం అక్కడ ఏర్పాటుచేసిన సైన్స్‌ఫేర్‌ను తిలకించారు. విద్యార్థులతో సరదాగా ముచ్చటించారు. రూ.12లక్షలతో నిర్మించే ఆరోగ్య ఉప కేంద్రానికి శంకుస్థాపన చేశారు. కొత్తపల్లిలో గురడికాపు, మాల, మాదిగ, గూండ్ల, యూత్ భవనాల పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఎంపీపీ సామ పద్మా వెంకటరెడ్డి, జడ్పీటీసీ బద్దం నర్సవ్వా నర్సారెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ముస్కు భూమేశ్వర్, సర్పంచులు జక్క మల్లుబాయి, మారెల్లి విష్ణు, కొ మ్ముల శ్రీనివాస్, ఉపసర్పంచులు జక్క గంగాధర్, సువ ర్ణా లింగం, తహసీల్దార్ టీవీ రోజా, ఎండీడీవో దామోదర్, ఎంపీటీసీలు జోషి వెంకట్రాజ్, పీఏసీఎస్ చైర్మన్ జక్క రాజేశ్వర్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
మెండోరా మండలంలోని సోన్పేట్లో జీపీ భవన భవనం, ఎస్సీ కమ్యూనిటీ హాల్, ప్రాథమిక పాఠశాల అదనపు తరగతి గదులు, సీసీ రోడ్లతో పాటు పోచంపాడ్ గ్రామంలో జీపీ భవనం, సీసీ రోడ్డు పనులకు మంత్రి ప్రశాంత్‌రెడ్డి శంకుస్థాపనలు చేశారు. ఆయా గ్రామాల్లో ప్రజలు మంత్రికి ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు, డీసీసీబీ డైరెక్టర్ నాగంపేట్ శేఖర్‌రెడ్డి, ఎంపీపీ బురుకల సుకన్యా కమలాకర్, జడ్పీటీసీ తలారి గంగాధర్, సర్పంచులు గోలి ప్రకాశ్, మిస్బావుద్దీన్, ఎంపీటీసీలు జాన్‌బాబు, ఎంపీటీసీల ఫోరం జిల్లా అధ్యక్షుడు బాబా, ఉపసర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు సంపంగి సతీశ్, సంధ్యా రమేశ్, ఆలయాల చైర్మన్లు సాగర్‌రెడ్డి, అనిల్‌బాబు, టీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు కొడముంజ రాజు, నాయకులు బాబు, బి.నవీన్‌గౌడ్, సాగర్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
బాధిత కుటుంబానికి పరామర్శ..
మెండోరా మండలంలోని పోచంపాడ్ గ్రామానికి చెందిన మైనార్టీ సెల్ మండల మాజీ అధ్యక్షుడు పాషాను మంత్రి ప్రశాంత్‌రెడ్డి పరామర్శించారు. పాషా తండ్రి రాజ్ మహమ్మద్ శనివారం రాత్రి మరణించారు. బాధిత కుటుంబీకులకు మంత్రి ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
భూపతిరావు కుటుంబానికి..
భీమ్‌గల్ పట్టణ మాజీ సర్పంచ్, మున్పిపల్ కో-ఆప్షన్ సభ్యురాలు గాడి శోభ భర్త భూపతిరావు కుటుంబ సభ్యులను మంత్రి ప్రశాంత్‌రెడ్డి ఆదివారం రాత్రి పరామర్శించారు. బాధిత కుటుంబీకులను మంత్రి ఓదార్చి ధైర్యం చెప్పారు. మంత్రి వెంట మున్సిపల్ చైర్పర్సన్ కన్నె ప్రేమలత, జడ్పీటీసీ చౌట్పల్లి రవి, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు మల్లెల లక్ష్మణ్, కౌన్సిలర్లు, కో-ఆప్షన్ సభ్యులు, టీఆర్ఎస్ నాయకులు ఉన్నారు.