డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో సోమవారం ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతోపాటు విద్యార్థులే ఉపాధ్యాయులుగా పాఠాలు బోధించి స్వయం పాలనాదినోత్సవాన్ని నిర్వహించారు. గురువులను విద్యార్థులు సన్మానించారు.
-నమస్తే తెలంగాణ యంత్రాంగం, సెప్టెంబర్ 5
మోర్తాడ్ ప్రభుత్వ పాఠశాలలో స్వయంపాలనా దినోత్సవం నిర్వహించగా, విద్యార్థులకు బహుమతులను అందజేశారు. బాల్కొండ ఆదర్శ పాఠశాలలో స్వయం పరిపాలనా దినోత్సవం, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. రెంజల్ మండలం దూపల్లి జడ్పీ ఉన్నత పాఠశాలలో ఉత్తమ ఉపాధ్యాయుడు సోమలింగం గౌడ్‌ను ఘనంగా సత్కరించారు. ఆర్మూర్ పట్టణంలోని పలువురు ఉపాధ్యాయులను నవనాథపురం లయన్స్‌క్లబ్ ఆధ్వర్యంలో సన్మానించారు. శ్రీభాషిత పాఠశాలలో స్వయంపాలనా దినోత్సవాన్ని నిర్వహించారు. అనంతరం విద్యార్థులు, సిబ్బంది నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.
సాంఘిక సంక్షేమ గురుకులంలో స్వచ్ఛ గురుకుల్ కార్యక్రమాన్ని సామాజిక కార్యకర్త తులసీకుమార్, టీఆర్ఎస్ నాయకుడు సాయి, తల్లిదండ్రుల కమిటీ అధ్యక్షుడు నర్సయ్య ప్రారంభించారు. మాక్లూర్ మండలం మాదాపూర్ ప్రాథమిక పాఠశాలలో హెచ్ఎం అనుపమను ఎస్ఎంసీ ఆధ్వర్యంలో సన్మానించారు. కోటగిరి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ సొసైటీ నిర్వాహకులు పోల విఠల్రావుగుప్తా, రాజేశ్వర్పటేల్ ఆధ్వర్యంలో గురుపూజోత్సవం నిర్వహించారు. ఎనిమిది మంది ఉత్తమ ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. టీయూలో ఏబీవీపీ – టీయూ శాఖ ఆధ్వర్యంలో వీసీ రవీందర్‌గుప్తా, రిజిస్ట్రార్ విద్యావర్ధినికి శుభాకాంక్షలు తెలిపారు. ధర్పలిలో సర్పంచ్ ఆర్మూర్ పెద్దబాల్‌రాజ్ గతంలో ఉపాధ్యాయుడిగా పనిచేశారు.
ప్రస్తుత వార్డుసభ్యుడు, పూర్వవిద్యార్థి ఇర్ఫాన్ సర్పంచ్‌ను ఘనంగా సన్మానించారు. రుద్రూర్ జీపీ వద్ద 20 మంది ఉపాధ్యాయులను ఎంఈవో శాంత కుమారి ఆధ్వర్యంలో సన్మానించారు. సిరికొండ మండలంలోని ఎస్టీ ఆశ్రమ పాఠశాల హెచ్ఎం కల్పనను గిరిజన ఆభివృద్ధి శాఖ అధ్వర్యంలో హైదరాబాద్‌లో ట్రైబల్ వెల్ఫర్ అడిషనల్ డైరెక్టర్ వి.సర్వేశ్వర్‌రెడ్డి సన్మానించి జ్ఞాపిక, ప్రశంసాపత్రాన్ని అందజేశారు. చందూర్ మండల పరిషత్ కార్యాలయంలో ఉపాధ్యాయులను ఎంపీపీ లావణ్యారాంరెడ్డి, వైస్ ఎంపీపీ దశాగౌడ్, ఎంఈవో శాంతకుమారి సన్మానించారు. దుబ్బాకలోని శ్రీ విద్యాపాఠశాలలో గురుపూజోత్సవాన్ని నిర్వహించారు. నగర శివారులోని ఖానాపూర్ అంగన్వాడీ కేంద్రంలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని నిర్వహించారు.