ఇందల్వాయి/డిచ్పల్లి, జూలై 9 : పేదింటి ఆడబిడ్డలకు రాష్ట్రప్రభుత్వం అండగా నిలుస్తున్నదని ఆర్టీసీ చైర్మన్, రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. ఇందల్వాయి మండలంలోని రైతువేదిక భవనం వద్ద వివిధ గ్రామాలకు చెందిన 130 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను శనివారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదింటి ఆడబిడ్డల పెండ్లికి సీఎం కేసీఆర్ రూ.1,00,116 అందజేస్తూ అండగా నిలుస్తున్నారన్నారు. పథకాల అమలులో ఏ రాష్ట్రం కూడా తెలంగాణకు సాటి రావన్నారు.
డిచ్పల్లి ఎస్ఎల్జీ గార్డెన్లో కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు.
ప్రజల ఆశీస్సులు ఉన్నంత వరకు ఏ శక్తులు టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఇతర పార్టీలు ఏమీ చేయలేవన్నారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఆర్థిక ప్రణాళిక సంఘం సభ్యుడు, జడ్పీటీసీ సభ్యుడు బాజిరెడ్డి జగన్మోహన్, ఎంపీపీ రమేశ్ నాయక్, ఐడీసీఎంఎస్ చైర్మన్ సాంబారి మోహన్, మండల అధ్యక్షుడు చిలువేరి దాస్, సొసైటీ చైర్మన్లు చింతలపల్లి గోవర్ధన్‌రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చిలువేరి గంగదాస్, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు మోహన్‌నాయక్, ప్రధాన కార్యదర్శి విజయ్‌కుమార్, స్థానిక ఎంపీటీసీ మారంపల్లి సుధాకర్, చింతల దాస్, పాశంకుమార్, క్రాంతి, నాయకులు, సర్పంచులు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి భూమిపూజ
డిచ్పల్లి, జూలై 9 : మండలకేంద్రంలోని కాశీ విశ్వనాథ ఆలయం ఎదుట షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణ పనులకు ఆర్టీసీ చైర్మన్, రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ భూమిపూజ చేశారు. అంతకుముందు కాశీ విశ్వనాథ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో జడ్పీటీసీలు బాజిరెడ్డి జగన్మోహన్, దాసరి ఇందిరా లక్ష్మీనర్సయ్య, డీసీఎంఎస్ చైర్మన్ సాంబారి మోహన్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చింత శ్రీనివాస్‌రెడ్డి, రైతుబంధు సమితి మండల కో-ఆర్డినేటర్ నారాయణరెడ్డి, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు మోహన్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి జగదీశ్, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు దండుగుల సాయిలు, సర్పంచుల ఫోరం మండల ప్రధాన కార్యదర్శి జగదీశ్, నాయకుడు శక్కరికొండ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
ఆర్టీసీ చైర్మన్‌ను సన్మానించిన వీడీసీ సభ్యులు
ఇందల్వాయి, జూలై 9 : ఇందల్వాయి గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులుగా ఇటీవల ఎన్నికైన వారు ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్‌ను శనివారం ఘనంగా సన్మానించారు. తమ గ్రామానికి డబుల్ రోడ్డును మంజూరు చేయాలని విన్నవించారు. కార్యక్రమంలో వీడీసీ చైర్మన్ మారంపల్లి సుధాకర్‌తో పాటు బాధ్యులు చిన్నగంగారాం, రామడ్గు పెద్ద గంగారాం, రఘుపతిరెడ్డి, కొందపురం గంగాధర్, ఎరుకల దేవేందర్, బాలగంగారాం, దండు పెద్దగంగారాం, నామాల పెద్ద గంగాధర్, పాషా పాల్గొన్నారు.