ఖలీల్‌వాడి, జూన్ 7 : నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌గుప్తా నగరంలో మంగళవారం పర్యటించి వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
58వ డివిజన్లోని లైన్గల్లీలో నిర్వహించిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో బిగాల గణేశ్‌గుప్తా పాల్గొన్నారు. ఆరో డివిజన్ పరిధిలోని వినాయక్‌నగర్ న్యూహౌసింగ్ బోర్డు కాలనీలో క్రీడా ప్రాంగణాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలనే ఉద్దేశంతో క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. క్రీడా ప్రాంగణంలో వాలీబాల్, బ్యాడ్మింటన్, కబడ్డీ కోర్టులతోపాటు, కాలనీవాసుల విన్నపం మేరకు వాకింగ్ ట్రాక్‌ను ఏర్పాటు చేస్తున్నామన్నారు. యువత క్రీడా ప్రాంగణాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
రూ.40లక్షల వ్యయంతో న్యాల్కల్ రోడ్డులోని ఆనంద్‌నగర్ కాలనీలో నిర్మించిన పట్టణ మహిళా నిరాశ్రయుల కేంద్రాన్ని గణేశ్‌గుప్తా ప్రారంభించారు. నిరాశ్రయులైన మహిళలు కేంద్రంలో ఆశ్రయం పొందాలన్నారు. మెప్మా, మహిళా పోలీస్‌స్టేషన్, నగర పాలకసంస్థ అధికారులు సంయక్తంగా మహిళా నిరాశ్రయుల కేంద్రాన్ని పర్యవేక్షించాలని కోరారు.
నాయీ బ్రాహ్మణ సేవా సంఘం కార్యవర్గ ప్రమాణస్వీకారం..
నగరంలో నిర్వహించిన నాయీ బ్రాహ్మణ సేవా సంఘం నూతన కార్యవర్గ ప్రమాణస్వీకార కార్యక్రమంలో ఎమ్మెల్యే బిగాల గణేశ్‌గుప్తా పాల్గొన్నారు.
సంఘ సభ్యులతో ప్రమాణస్వీకారం చేయించారు. నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులు గడీల భూమేశ్, బత్తిని రమేశ్, సంజీవన్కర్ శంకర్, వెల్పుల బాలస్వామి, ఆవుర్గే నారాయణ, జంపల మురళి, కలూరి భూషణ్, జంపల భాస్కర్, సూత్రపు శ్రీనివాస్, రాచమళ్ల రాజు, లింబాద్రికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాయినగర్-2లో నాయీ బ్రాహ్మణ సంఘ భవన నిర్మాణానికి రూ.15లక్షల సీడీపీ నిధులు కేటాయించామని, నాయీ బ్రాహ్మణుల అభివృద్ధి కోసం నిధులు కేటాయిస్తున్నామని పేర్కొన్నారు.
ఆయా కార్యక్రమాల్లో నగర మేయర్ దండు నీతూకిరణ్, కార్పొరేటర్లు అబ్దుల్ ఖుద్దూస్, ఉమారాణీశ్రీనివాస్, నాయకులు సిర్ప రాజు, అంబదాస్, సాధుసాయి, వెల్డింగ్ నారాయణ, వర్ణన్, బట్టు రాఘవేందర్, రాజేంద్రప్రసాద్, సుజిత్‌సింగ్ ఠాకూర్, సత్యప్రకాశ్, సదానంద్, కంచర్ల సంతోష్, మచల్ శ్రీనివాస్, పాక సురేశ్, మాకు రవి, కులచారి సంతోష్, నాంపల్లి, నవీన్ ఇక్బాల్, ఇమ్రాన్, షెహజాద్, అఫ్జల్, అరుణ్, చింతకాయల రాజు, సంతోష్, ఎర్రం గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.