జమ్మికుంట రూరల్, మే 27: వరికొయ్యలకు నిప్పుపెడుతూ మంట లు అంటుకొని రైతు మరణించాడు. ఈ విషా ద ఘటన కరీంనగర్ జిల్లా జమ్మికుంట ము న్సిపల్ పరిధిలోని మో త్కులగూడెంలో శుక్రవా రం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకా రం.. మోత్కులగూడెం గ్రామానికి చెందిన పొనగంటి పాపయ్య(80) ఊరి శివారులో ఉన్న ఎకరన్నర పొలం వద్దకు శుక్రవారం ఉదయం ఇంటి నుంచి వెళ్లాడు. కొయ్యకాలుకు నిప్పంటించడంతో మంటలు ఒక్కసారిగా ఎగిసిపడ్డాయి. ఒడ్డు గట్టున కూర్చున్న పాపయ్య ప్రమాదవశాత్తు జారిపడి మంటల్లో చిక్కుకున్నాడు. తీవ్రగాయాలతో అక్కడికక్కడే మరణించాడు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న కుటుంబ సభ్యు లు పొలంవద్దకు వెళ్లారు. మంటల్లో కాలిబూడిదైన పాపయ్య మృతదేహాన్ని చూసి బోరున విలపించారు. ఎస్సై రాంమోహన్ సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు.
మృతుడి కుమారుడు రవికుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.