రుద్రూర్, మే 22: పేదరికంతో పోటీ పరీక్షల శిక్షణకు దూరమవుతున్న అభ్యర్థులకు ప్రభుత్వ విభాగాలు, పోలీసులు, అధికార పార్టీ నేతలు ఆపన్నహస్తం అందిస్తున్నారు. వారికి ఉచితంగా శిక్షణ అందిస్తున్నారు. మెటీరియల్, మ ధ్యాహ్న భోజనం వంటివి అందిం చి నిరుద్యోగులకు తమవంతు అం డగా నిలుస్తున్నారు. బాన్సువాడ నియోజకవర్గానికి చెందిన ఉద్యోగార్థులకు రెండు చోట్ల ఉచితంగా శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయించారు ఉమ్మడి జిల్లా డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్‌రెడ్డి. నియోజకవర్గానికి చెందిన వర్ని, కోటగిరి, రుద్రూర్, చందూర్, మోస్రా మండలాలకు చెందిన ఉద్యోగార్థుల కోసం వర్ని, బాన్సువాడలో పీబీఆర్ కోచింగ్ సెంటర్లను ప్రారంభించారు. అన్ని రకాల పోటీ పరీక్షలకు అభ్యర్థులకు శిక్షణ ఇవ్వనున్నారు. మెటీరియల్‌ను కూడా ఉచితంగానే అందిస్తున్నారు. రోజూ ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు తరగతులు కొనసాగుతున్నాయి. అభ్యర్థులకు మధ్యాహ్నం భోజనంతోపాటు సాయంత్రం టీ, స్నాక్స్ అందిస్తున్నారు. హైదరాబాద్‌లోని ప్రముఖ కోచింగ్ సెంటర్లలో బోధించే ఫ్యాకల్టీని ఈ కేంద్రానికి రప్పించి తరగతులు నిర్వహిస్తున్నారు.
ప్రభుత్వ కొలువు సాధించాలి..
యువత లక్ష్యసాధనలో అలసిపోవద్దు. అనుకున్నది సాధించేవరకు సాధన ఆపొద్దు. మీ లక్ష్యసాధనలో నావంతు సహాయం చేస్తా. ప్రతి ఒక్కరూ ప్రభుత్వ కొలువు సాధించాలని కోరుకుంటున్న.
-పోచారం భాస్కర్‌రెడ్డి, డీసీసీబీ చైర్మన్
కోచింగ్ తీసుకోవాలన్న కోరిక తీరింది..
మాది రాణంపల్లి. డిగ్రీ చదువుకున్నాను. ప్రభుత్వం ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. కానీ నాకు హైదరాబాద్ వెళ్లి కోచింగ్ తీసుకునేంత ఆర్థిక స్థోమత లేదు. దీంతో పోచారం భాస్కర్‌రెడ్డి సార్ ఉచితంగా కోచింగ్ ఇప్పిస్తున్నారని తెలుసుకొని వచ్చాను. కష్టపడి చదివి ప్రభుత్వ ఉద్యోగం సాధిస్తాను.
-శంకర్, రాణంపల్లి
పోచారం కుటుంబానికి కృతజ్ఞతలు
నేను డిగ్రీ పూర్తి చేశాను. పోటీ పరీక్షలు రాసి ప్రభుత్వ ఉద్యోగం సాధించాలన్నది నా కోరిక. పోచారం భాస్కర్‌రెడ్డి ఉచితంగా కోచింగ్ సెంటర్‌ను ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉన్నది. పట్టుదలతో చదివి ప్రభుత్వ కొలువు సాధిస్తాను. ఉచితంగా శిక్షణ అందిస్తున్న పోచారం కుటుంబానికి కృతజ్ఞతలు.
-మౌనిక, నిరుద్యోగి, రుద్రూర్
పోలీసునవుతా..
రుద్రూర్లో పోచారం భాస్కర్‌రెడ్డి ఉచితంగా కోచింగ్ ఇప్పిస్తున్నారని తెలుసుకొని సంతోషపడ్డాను. దగ్గరలో కోచింగ్ సెంటర్లు లేక ఇబ్బందిపడ్డాం. పోలీసు కానిస్టేబుల్ కావాలన్నది నా కల. ఈ కోచింగ్ సెంటర్లో శ్రద్ధగా చదివి పోలీసు ఉద్యోగం సాధిస్తాను.
-మైన, నిరుద్యోగి, కోటగిరి