ఆర్మూర్, మే 7: నిరుపేదల ఇండ్లలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌తో కల్యాణ కాంతులు వెల్లివిరుస్తున్నాయని ఎంపీపీ పస్క నర్సయ్య, జడ్పీటీసీ మెట్టు సంతోష్, సర్పంచులు కొత్తపల్లి లక్ష్మి, మోహన్‌రెడ్డి అన్నారు. మండలంలోని ఆలూర్, మగ్గిడి, మచ్చర్ల, ఫత్తేపూర్ గ్రామాల్లో పలువురికి మంజూరైన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు శనివారం పంపిణీ చేశారు. కార్యక్రమాల్లో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఆలూర్ శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీటీసీలు హన్మాండ్లు, మార్కంటి లక్ష్మీమల్లేశ్, నాయకులు గడ్డం గయాల్ గంగారెడ్డి, వజ్రంరెడ్డి, మోతె చిన్నారెడ్డి, రేగుళ్ల రజినీకాంత్, అగ్గు క్రాంతి, వెల్మ గంగారెడ్డి, దార్ల సంతోష్‌రెడ్డి, ఉపససర్పంచులు గంగారెడ్డి, దుమ్మాజీ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
సీఎంఆర్ఎఫ్ చెక్కుల అందజేత..
మండలంలో పలువురికి మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను డీసీసీబీ డైరెక్టర్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు నాగంపేట్ శేఖర్‌రెడ్డి శనివారం అందజేశారు. మొత్తం 16 మంది లబ్ధిదారులకు రూ.7,52,500 విలువైన ఆర్థిక సహాయం చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి వేములతో పాటు సీఎం కేసీఆర్‌కు లబ్ధిదారుల తరఫున కృతజ్ఞతలు తెలిపారు. జడ్పీటీసీ తలారి గంగాధర్, వైస్ ఎంపీపీ రవిగౌడ్, రైతుబంధు సమితి మండల కో-ఆర్డినేటర్ సాయిరెడ్డి, సర్పంచులు సామ గంగారెడ్డి, మచ్చర్ల రాజారెడ్డి, గోపిడి గంగారెడ్డి, పి.శ్రీనివాస్, ఎంపీటీసీ దేవేందర్, బాబా, ఉపసర్పంచులు, పార్టీ ప్రధాన కార్యదర్శి నవీన్‌గౌడ్, మైనార్టీ సెల్ మండల అధ్యక్షుడు అక్తర్, గ్రామశాఖ అధ్యక్షులు మోహన్‌రెడ్డి, రాజేందర్, కొదముంజ రాజు తదితరులు పాల్గొన్నారు. ఆర్మూర్ పట్టణంలోని పెర్కిట్‌లోని మున్సిపల్ 21వ వార్డుకు చెందిన మంథని హన్మాండ్లు, అయేషా జబీన్‌కు మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను కౌన్సిలర్ లిక్కి శంకర్ శనివారం అందజేశారు. ఎమ్మెల్యే జీవన్‌రెడ్డికి లబ్ధిదారుల తరపున కౌన్సిలర్ కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో నాయకులు మందాపురం సుభాష్‌గౌడ్, ఎన్న సత్యానందం, సుంకరి రత్నం, రాస సంజీవ్, ద్రౌపతి తదితరులు పాల్గొన్నారు.