ఎడపల్లి (శక్కర్‌నగర్), మే 1: ఎడపల్లి మండలంలోని జైతాపూర్ శివారులో పలు వ్యవసాయ మో టర్లకు చెందిన కేబుల్ వైర్ల చోరీకి పాల్పడిన ఇద్దరు యువకులను ఆదివారం ఉదయం గ్రామస్తులు పట్టుకుని దేహశుద్ధి చేశారు. సంఘటనకు సంబంధించి గ్రామస్తులు, ప్రత్యక్ష సాక్షులు అందించిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. జంలం శివారులోని ఓ పంటపొలంలో ఆదివారం మంట కనిపించడంతో ఎందుకు పెడుతున్నారంటూ ఓ రైతు సదరు యువకులను ప్రశ్నించాడు. దీంతో వారు అక్కడి నుంచి పరారయ్యేందుకు యత్నించారు. దీంతో స్థానికులు వారిని పట్టుకుని మంటలు ఆర్పి చూసే సరికి వ్యవసాయ మోటర్లకు చెందిన కేబుల్‌వైర్లు కనిపించాయి. దీంతో వారిని పట్టుకుని దేహశుద్ధి చేశారు. గతంలో కూడా దూపల్లి శివారు నుం చి చోరీలు జరిగాయంటూ ఆగ్రహం వ్యక్తం చేశా రు.
ఒక్కో మోటరుకు రెండు నుంచి నాలుగు మా ర్లు ఓ పంట సీజన్లో వైర్లు చోరీ జరుగుతున్నాయని, దీంతో ఒక్కోసారి మరమ్మతు చేయించేందుకు సుమారు రూ. 2వేల ఖర్చు అవుతున్నదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న ఎడపల్లి ఎస్సై పాండేరావు సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని యువకులను అదుపులోకి తీసుకున్నారు. కాగా, తమకు న్యాయం చేయాలంటూ రైతులు ఆందోళన చేసేందుకు సిద్ధం కాగా, ఎస్సై పాండేరావు రైతులతో మాట్లాడి ఇ లాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూస్తానని, పెట్రోలింగ్ ముమ్మరం చేస్తామని రైతులకు హామీ ఇచ్చారు. అనంతరం ఆయన ఎడపల్లి పోలీస్ స్టేషన్లో మాట్లాడుతూ జంలం గ్రామానికి చెందిన ప్రభాకర్ ఫిర్యాదు మేరకు కేబుల్ వైర్ల చోరీకి పాల్పడిన సురేశ్, సునీల్‌పై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.