ఆర్మూర్, ఏప్రిల్ 19: పట్టణంలోని నవనాథ సిద్ధులగుట్ట ఘాట్ రోడ్డు లైటింగ్ కోసం ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి రూ.40 లక్షల నిధులను మంజూరు చేశారు. దీంతో సిద్ధులగుట్ట ఆలయ కమిటీ సభ్యులు మంగళవారం హైదరాబాద్ తరలివెళ్లి ఎమ్మెల్యే జీవన్‌రెడ్డిని ఆయన నివాసంలో కలిశారు. నిధులు మంజూరు చేయడంపై హర్షం వ్యక్తంచేస్తూ ఎమ్మెల్యేకు పట్టు శాలువా కప్పి సత్కరించారు. ఎమ్మెల్యేను కలిసిన వారిలో ఆలయ కమిటీ చైర్మన్ ఏనుగు చంద్రశేఖర్‌రెడ్డి, సభ్యులు బొబిడె గంగాకిషన్, నక్కల లక్ష్మణ్, బాబు, టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు సంజయ్‌సింగ్ బబ్లూ తదితరులు ఉన్నారు.
ఇఫ్తార్‌లో పాల్గొన్న ఎమ్మెల్యే..
పెర్కిట్‌లోని ఓ గార్డెన్లో మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ మున్నా సోమవారం ఇఫ్తార్‌ను ఏర్పాటు చేశారు. విందులో ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మైనార్టీల అభ్యున్నతికి సీఎం కేసీఆర్ కృషిచేస్తున్నారని చెప్పారు. ముస్లిములకు ఆయన ముందస్తుగా రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఆశన్నగారి రాజేశ్వర్‌రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ పండిత్ వినిత, ఎంపీపీ పస్క నర్సయ్య, జడ్పీటీసీ మెట్టు సంతోష్, టీఆర్ఎస్ మైనార్టీ నాయకుడు ఉస్మాన్ హజ్రామి, నాయకులు పండిత్ ప్రేమ్, ఖాందేశ్ శ్రీనివాస్, బారడ్ రమేశ్, అంజాగౌడ్, మహ్మద్ హమీద్, సుమీర్ అహ్మద్, అబ్దుల్ రెహ్మాన్, సయ్యద్ అతీక్, ఇంతియాజ్, ఫయాజ్, మున్సిపల్ కౌన్సిలర్లు, చేపూర్ సర్పంచ్ టీసీ సాయన్న తదితరులు పాల్గొన్నారు.